
ఢిల్లీలో పుట్టి పెరిగిన శ్రద్ధా ఆర్య.. సినిమా హీరోయిన్, సీరియల్ నటిగా ఫేమస్.

2004లో రియాలిటీ షోలో పాల్గొని కెరీర్ మొదలుపెట్టింది.

2006లో తమిళ సినిమా 'కలవనిన్ కదలి'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తర్వాతే ఏడాదే 'గొడవ' మూవీతో తెలుగులోనూ హీరోయిన్‌గా చేసింది.

దీనితో పాటు రోమియో, కోతిమూక అనే సినిమాల్లో నటించింది.

2018లో చివరగా ఓ పంజాబీ చిత్రంలో నటించింది అంతే.

సినిమాలు చేయనప్పటికీ పలు హిందీ సీరియల్స్, రియాలిటీ షోలు చేసింది.

2021లో రాహుల్ నగళ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

మూడు వారాల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.

ఇప్పుడు బేబీ షవర్ సెలబ్రేషన్స్ ఫొటోలని పోస్ట్ చేసింది.

ఇందులో భర్తతో కలిసి శ్రద్ధా ఆర్య బేబీ బంప్‌తో నిండుగా కనిపించింది.














