కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా ఆర్య కవలలకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిన విషయాన్ని బయటపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించి ఈమె గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ పెళ్లి దుస్తుల డిజైనర్ ఎవరో తెలుసా..?)2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. గతేడాది రిలీజైన హిందీ మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. వీటితో పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది.వైవాహిక జీవితం విషయానికొస్తే.. 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)