
తెలుగులో వరసపెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు.

పుట్టి పెరిగింది పంజాబ్‌లోనే. పదేళ్లకే ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది.

2013లో టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా పోటీలో విజేత.

ఆ తర్వత ఓ సబ్బు యాడ్‌లో నటించింది. అది చూసి డైరెక్టర్ హను రాఘవపూడి మూవీ ఛాన్స్ ఇచ్చాడు.

అలా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది.

2016 నుంచి 2022 మధ్య దాదాపు 14 తెలుగు మూవీస్ చేసింది.

2021లో హర్యానాకి చెందిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది.

హర్యానాకి గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు ఇతడు.

కారణమేంటో తెలీదు గానీ మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ పెళ్లి చేసుకోలేదు.

అప్పటినుంచే సినిమాల సక్సెస్ లేక మెహ్రీన్ కెరీర్ కూడా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది.

ప్రస్తుతానికైతే మెహ్రీన్ కొత్త మూవీస్ చేస్తున్నట్లు లేదు. ఫ్యామిలీ కలిసి ఉంటోంది.









