తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా టీ ఇంటర్మీడి యెట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా టీ ఇంటర్మీడి యెట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నా.. జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తెలంగాణ బోర్డును ప్రత్యేకంగా చూపించలేదు. దీంతో గత నెలలో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు పేరుమీదే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బోర్డు) అవకాశం కల్పించింది. ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం బోర్డు పరి దిని మార్చుకునేందుకు విద్యార్థులు చూస్తున్నా ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డును చూపించడం లేదు.
ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును చూపించాలని ఈ నెల 28న సీబీఎస్‌ఈకి లేఖ రాసేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. సవరణల గడువును పెంచాలని కూడా లేఖలో కోరనున్నారు. మెయిన్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ప్రత్యేకంగా చూపించేలా ఆప్షన్ పొందుపరచాలని సీబీఎస్‌ఈని కోరనున్నారు.