సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. ఫలితాల కోసం www.sakshieducation.com లో చూడవచ్చు.
మొదటి సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో (2,70,575 ) 59.8 శాతం మంది, సెకండియర్‌లో 65శాతం (2,71,949) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా,34శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జగిత్యాల చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment