intermidiate
-
అందరికీ ఉన్నత విద్య
పేద విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుంది. నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది నుంచి జెడ్పీ హైస్కూ ల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒక జూనియర్ కళాశాల కేవలం బాలికలకు కేటాయించనున్నారు. ఇప్పటికే అన్ని వసతులు ఉన్న జెడ్పీ హైస్కూల్స్‌ను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నుంచి ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 51 జెడ్పీ హైస్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టనున్నారు. వాటిల్లో ఒకటి బాలిక కళాశాల ఒకటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ప్రాంతాల్లోని జెడ్పీ హైస్కూల్స్‌ను ఎంపిక చేశారు. వీటిల్లో 33 బాలికల, 18 కో–ఎడ్యుకేషన్ (బాలురు, బాలికలు) కళాశాలలుగా ఎంపిక చేశారు. అయితే వచ్చే ఏడాది నుంచి కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్కడే ఇంటర్ చదివే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ప్రోత్సహించే పనిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం రెండు మండలాల్లో రెండేసి జూనియర్ కళాశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు మండలంలోని కోవూరు, ఇనమడుగు ప్రాంతాల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మహిళల కోసం కేవలం డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల మాత్రమే ఉంది. ఇప్పటికే 6 కేజీబీవీల్లో బాలికలకు ఇంటర్ అందిస్తున్నారు. మరో 4 కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో పాటు 10 మోడల్స్ స్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న జూనియర్ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. ఒక్కో గ్రూపులో కనీసం 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్థుల ఎంపికలో రిజర్వేషన్, దారిద్య్రరేఖకు దిగువను ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇంటర్‌కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 4వ తేదీ నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. ఈ కళాశాలలను ప్రారంభిస్తే పేద వర్గాలకు ఉన్నత విద్య మరింత అందుబాటులోకి రానుంది. అందరికీ అందుబాటులో ఇంటర్ విద్య ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య అందరికీ అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 33 హైస్కూల్స్‌ల్లో బాలికల జూనియర్ కళాశాలలను, మరో 18 ఉన్నత పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయబోతున్నాం. దీనిపై విధి విధానాలు వచ్చిన వెంటనే ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను ప్రారంభిస్తాం. – డీఈఓ రమేష్, డీవీఈఓ శ్రీనివాసులు -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల బాలికలు ముందంజ
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. ఫలితాల కోసం www.sakshieducation.com లో చూడవచ్చు. మొదటి సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో (2,70,575 ) 59.8 శాతం మంది, సెకండియర్‌లో 65శాతం (2,71,949) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా,34శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జగిత్యాల చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలంగాణలో నేటి నుండి ఇంటర్ పరీక్షలు
-
ఇంటర్ గడప దాటగానే 15% డ్రాపౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పని బాట పడుతున్నారు. ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణంకాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియట్ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండడం ఆందోళనకరమైన అంశం. విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల లెక్కలు చూస్తే.. ఇంటర్ పూర్తయ్యాక చదువు మానేస్తున్నవారి శాతం కొన్నేళ్లుగా దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. 2016–17లో ఉత్తీర్ణులైన మొత్తం ఇంటర్ విద్యార్థుల్లో 14 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోగా... 2015–16లో 17 శాతం మంది.. 2014–15లో 15 శాతం మంది పై చదువులకు వెళ్లలేదు. ఇక పదో తరగతికి వస్తే.. 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తయిన వారిలో 4.95 శాతం మంది పైచదువులకు దూరంకాగా.. 2015–16లో 6 శాతం మంది, 2014–15లో 7 శాతం మంది డ్రావుట్స్గానే మిగిలిపోయారు. ఇంటర్ తర్వాత భారీగా.. రాష్ట్రవ్యాప్తంగా 2016–17 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇక ఇంటర్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 1,00,701 మంది చేరగా.. అందులో 10 శాతం మంది ఏపీ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అంటే 90,631 మంది రాష్ట్రవిద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. ఇక డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు. ‘పది’తోనే ఆగిపోయిన 23,820 మంది 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 5,97,064 మంది హాజరుకాగా.. అందులో 4,80,831 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 3,99,377 మంది ఇంటర్లో, 26,594 మంది ఐటీఐలలో, 31,040 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరారు. మొత్తంగా పదో తరగతి పూర్తయిన వారిలో... 4,57,011 మంది వివిధ కోర్సుల్లో చేరగా 23,820 మంది చదువును ఆపేసినట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు వేసింది. 2017–18లో ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరినవారు కోర్సు చేరినవారు బీటెక్ 68,593 బీఫార్మసీ 6,500 డీఎడ్ 10,200 ఎంబీబీఎస్ 3,200 బీడీఎస్ 1,400 ఆయుష్ 695 అగ్రికల్చర్, వెటర్నరీ 500 జాతీయ విద్యా సంస్థలు, విదేశీ చదువుకు వెళ్లిన వారు 9,612 బీఏలో చేరిన వారు 25,599 బీబీఎం 306 బీబీఏ 1,762 బీసీఏ 336 బీకాం 80,696 బీఎస్సీ 91,702 బీఎస్‌డబ్ల్యూ 36 డిగ్రీ వొకేషనల్ 20 ఇదీ చదువుల దుస్థితి.. పదో తరగతి స్థాయి నుంచి.. సంవత్సరం పాసైనవారు పైకోర్సుల్లోకి డ్రాపౌట్ 2014–15 4,44,828 4,13,691 31,137 2015–16 4,37,192 4,10,961 26,231 2016–17 4,80,831 4,57,011 23,820 ఎందుకు ఆపేస్తున్నారు? – పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతోనే మానేస్తున్నట్లు గుర్తించారు. – ఇంటర్ పూర్తయిన వారు మాత్రం ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ భారం మీద పడటంతో చదువులకు దూరమవుతున్నట్లు తేల్చారు. – ఇక పైచదువులకు తగిన సామర్థ్యాలు కొరవడటంతో.. తాను ఇక చదవలేన్న ఆలోచన, ఆత్మన్యూనతా భావంతో చదువు మానేస్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. దీంతో ఏదో ఒక పని చేసుకుని బతుకుదామన్న ధోరణితో చదువుకు దూరమవుతున్నారు. – పై చదువులపై అవగాహన లోపం కూడా కొందరు విద్యార్థులు దూరమవడానికి కారణంగా గుర్తించారు. – పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నవారిలో చాలా మందికి పైచదువులకు వెళ్లాలన్న కోరిక ఉన్నా... పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు చేపట్టాలి.. ‘‘పదో తరగతి, ఇంటర్ తరువాత విద్యార్థులు చదువు మానేయడం మంచిదికాదు. కొద్దిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం కూడా డ్రాపౌట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి..’’ – ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ పి.మధుసూదన్‌రెడ్డి -
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28నుంచే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం సవరిం చింది. 2018 మార్చి 1 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏపీలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండటంతో అదే తేదీ నుంచి రాష్ట్రంలోనూ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రెగ్యులర్ పరీక్షలతోపాటు అంతకంటే ముందే నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ పరీక్షల సవరించిన టైంటేబుల్‌ను ఈ మేరకు విడుదల చేసింది. దీని ప్రకారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, సెకండియర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. అలాగే జనవరి 27న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, జనవరి 29న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషన్ కోర్సుల వారికి ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. గందరగోళం, అనుమానాలు వద్దనే... వాస్తవానికి మార్చి 1 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేలా బోర్డు ఈ నెల 7న టైంటేబుల్‌ను ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో కామన్ సిలబస్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పరీక్ష జరిగిన మర్నాడే తెలంగాణలో అదే పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరీక్షల ప్రశ్నపత్రాన్ని తెలంగాణలో పేపర్ లీకేజీ పేరిట వదంతులు సృష్టిస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. పైగా ఆ ప్రశ్నపత్రాలపై అది ఏ రాష్ట్ర బోర్డుకు చెందిందో ఉండదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఎటువంటి గందరగోళం, ఆందోళన తలెత్తకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే తేదీల్లోనే రాష్ట్రంలోనూ వార్షిక పరీక్షలు నిర్వహించేలా తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను సవరించింది. -
ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు
టేకులపల్లి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆర్ఐఓ విశ్వేశ్వరరావు తెలిపారు. గురువారం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపియింగ్, మాల్ ప్రాక్టీస్ నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించన్నునట్లు తెలిపారు. జీపిఎస్ విధానం ద్వారా పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల మేరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకుండా నియంత్రిస్తామని అన్నారు. దీని ద్వారా హైటెక్ కాపియింగ్‌కు తెరపడుతుందని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు నియమించిన అధికారుల పని తీరు ను సైతం పరిశీలించేందుకు ప్రత్యేకంగా శాటిలైట్ సహాయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా తనిఖీ అధికారులు ఏ కేంద్రానికి వెళ్లారు, ఎంత సేపు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారనేది పూర్తి వివరాలు నమోదవుతాయని అన్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. జిల్లాలో 93 ప్రాక్టికల్స్, 104 థీయరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. జిల్లాలో 19 కాలేజీల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో సిలబస్ పూర్తయిం దని, ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో 15వ స్థానంలో ఉన్న ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
ఇంటర్ పరీక్షల టైంటేబుల్ మార్పు
తొలిరోజు ఆంగ్లానికి బదులు ద్వితీయ భాష పరీక్షలు' సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబుల్లో మార్పులు చేసినట్లు బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదట జారీ చేసిన షెడ్యూలు ప్రకారం మార్చి 12వ తేదీన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిషు పరీక్ష, 13వ తేదీన ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దీన్ని మార్పు చేశారు. 12వ తేదీన ప్రథమ సంవత్సర ద్వితీయ భాష పరీక్షను, 13వ తేదీన ద్వితీయ సంవత్సర ద్వితీయ భాష పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. ప్రథమ సంవత్సర ఇంగ్లిషు పరీక్షను 14వ తేదీన, ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పరీక్షను 15వ తేదీన నిర్వహిస్తామని వివరించారు. మిగతా పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. గ్రామీణ విద్యార్థుల్లో ఆందోళనను తొలగించేందుకు తొలిరోజు ఇంగ్లిషు పరీక్షను సవరిస్తూ బోర్డు మార్పు చేసింది.