టేకులపల్లి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆర్‌ఐఓ విశ్వేశ్వరరావు తెలిపారు. గురువారం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపియింగ్, మాల్ ప్రాక్టీస్ నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించన్నునట్లు తెలిపారు. జీపిఎస్ విధానం ద్వారా పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల మేరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకుండా నియంత్రిస్తామని అన్నారు.
దీని ద్వారా హైటెక్ కాపియింగ్‌కు తెరపడుతుందని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు నియమించిన అధికారుల పని తీరు ను సైతం పరిశీలించేందుకు ప్రత్యేకంగా శాటిలైట్ సహాయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా తనిఖీ అధికారులు ఏ కేంద్రానికి వెళ్లారు, ఎంత సేపు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారనేది పూర్తి వివరాలు నమోదవుతాయని అన్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. జిల్లాలో 93 ప్రాక్టికల్స్, 104 థీయరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. జిల్లాలో 19 కాలేజీల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో సిలబస్ పూర్తయిం దని, ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో 15వ స్థానంలో ఉన్న ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు
Published Fri, Jan 10 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement