vishweshwar rao
-
కరోనాతో యు. విశ్వేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ దర్శక–నిర్మాత, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వియ్యంకుడు యు. విశ్వేశ్వర రావు (92) ఇక లేరు. గురువారం ఆయన చెన్నైలో కరోనాతో కన్నుమూశారు. విశ్వేశ్వర రావు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో మేనమామ చేరదీశారు. విశ్వేశ్వరరావును బాగా చదివించాలనుకున్న బావ దావులూరి రామచంద్రరావు బి.ఎస్సీ వరకు చదివించారు. ఆ తర్వాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరారు విశ్వేశ్వరరావు. చదువు చెప్పిన టీచర్లకు సహ ఉపాధ్యాయుడిగా చేశారాయన. గుడివాడలోనే జనతా ట్యుటోరియల్ ఇ¯Œ స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపారు. ఎన్టీఆర్ ప్రోద్బలంతో సినీ రంగంలోకి వచ్చారు. పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరి, ‘కన్యాశుల్కం’, ‘జయభేరి’ చిత్రాలకు పని చేశారు విశ్వేశ్వరరావు. ఆ సమయంలో ‘బాలనాగమ్మ’ సినిమా తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు. ఆ చిత్రం మంచి లాభాలు తీసుకురావడంతో కుమార్తె శాంతి పేరుతో ‘విశ్వశాంతి’ అనే సంస్థను స్థాపించారు. పలు అనువాద చిత్రాలను అందించారు. ఎన్టీఆర్‌తో ‘కంచుకోట’, ‘నిలువు దోపిడీ’, ‘పెత్తందార్లు’, దేశోద్ధారకులు వంటి చిత్రాలు నిర్మించారాయన. తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనుకునేవారు. కానీ, అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా మారి, ‘తీర్పు’, ‘నగ్నసత్యం’, ‘హరిశ్చంద్రుడు’, ‘కీర్తి కాంత కనకం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా, రచయితగా రెండు నంది అవార్డ్స్ అందుకున్నారు. కుమార్తె శాంతిని ఎన్టీఆర్ కుమారుడు– కెమేరామ్యాన్ మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అలా రామారావుకి విశ్వేశ్వర రావు వియ్యంకుడు అయ్యారు. 1986లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. ఆ సమయంలో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు చేశారు. ఎఫ్డీసీ డైరెక్టర్ చైర్మన్‌తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అనేక పదవుల్లో తన సేవలు అందించారు. విశ్వేశ్వర రావుకి కుమార్తెలు మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఒక కుమార్తె హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తండ్రి కడచూపునకు కూడా పిల్లలు చేరుకోలేని పరిస్థితి. దీంతో విశ్వేశ్వరరావు భౌతికకాయానికి గురువారం చెన్నైలో ఆయన మిత్రులే అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వేశ్వరావు మృతి పట్ల తెలుగు సినీ నిర్మాతల మండలి, హీరో బాలకృష్ణ, సౌతిండియన్ ఛాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. -
ప్రభుత్వ అండతోనే ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ
హైదరాబాద్: ప్రభుత్వ అండతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీని కొనసాగిస్తున్నాయని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు విమర్శించారు. ‘ఫీజుల పెంపుదలతో తల్లిదండ్రులపై జరుగుతున్న దోపిడీ, విద్యాప్రమాణాల పతనం’అనే అంశంపై పేరెంట్స్ అసోసియేషన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిషన్ సిఫార్సులను పక్కనపెట్టి ప్రైవేట్ యాజమాన్యాలు ఏటా ఫీజులు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలను ఫీజుల నియంత్రణ కోసం కాకుండా ఫీజుల రద్దు కోసం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యను రద్దు చేసి ప్రభుత్వమే ఉచిత నిర్భంద విద్యను అమలు చేయాలని సూచించారు. ఆర్థోపిడీషియన్ డాక్టర్ ఆసిఫ్ అనీఫ్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల విధానాల వల్ల పుస్తకాల బరువుతో చిన్నారుల్లో స్సైనల్, భుజం నొప్పి వస్తున్నాయని, ఇది గూని సమస్యకు దారితీసే అవకాశం ఉందన్నారు. డాక్టర్ సత్తార్‌ఖాన్ మాట్లాడుతూ.. ఒక దేశం భవిష్యత్తు నిర్ణయించేది విద్యారంగమేనని కానీ దురదృష్టవశాత్తూ నేటి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యాపారీకరణ కారణంగా ప్రైవేటు రంగంలోకి నెట్టబడుతుం దన్నారు. పీఏసీసీ సభ్యులు తేజ మాట్లాడుతూ, రాజ్యాంగాలు కల్పించిన ఉచిత నిర్బంధ విద్యను అన్ని ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నెత్తుటి పటం
పట్టుకోండి చూద్దాం విశ్వేశ్వర్రావుకు శాస్త్రవేత్తగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో ఖరీదైన ఇంట్లో నివసించే రావు తన శేషజీవితాన్ని స్వగ్రామమైన మంగన్నపాలెంలో గడపడానికి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఏడ్చారు. పట్టుదలకు మారుపేరుగా కనిపించే విశ్వేశ్వర్రావు... వారి మాటను మన్నించలేదు. భవబంధాలలో చిక్కుకున్న రుషి తిరిగి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లినట్లు ఆయన తన స్వగ్రామానికి వెళ్లాడు. ఊరికి దూరంగా మంచి ఇల్లు ఒకటి కట్టుకొని అందులోనే ఉండడం మొదలు పెట్టాడు. ‘‘నేను ఇక్కడికి వచ్చింది సన్యాసం స్వీకరించడానికి కాదు... నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రయోగాలను ఇక్కడ చేయాలనుకుంటున్నాను. ప్రశాంతంగా, ఏకాంతంగా చేయాలి. పట్నంలో అది కుదిరే పని కాదు... అందుకే ఇలా వచ్చాను’’ అని గ్రామస్థులతో చెప్పేవాడు విశ్వేశ్వర్రావు. తమ ఊరికి కొత్తగా వచ్చిన విశ్వేశ్వర్రావుతో మాట్లాడడానికి గ్రామస్థులు ఉత్సాహం ప్రదర్శించేవాళ్లు. మొదట్లో వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపినా... ఆ తరువాత మాత్రం తనలోకంలో తానుండి పెద్దగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. ఈ విషయం తెలిసి, ఆయన ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా గ్రామస్థులు పెద్దగా కలిసేవారు కాదు. సిటీ నుంచి మాత్రం అప్పుడప్పుడు ఆయన స్నేహితులు వచ్చి పోయేవాళ్లు. పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తయారుచేసే ప్రయోగాల్లో విశ్వేశ్వర్రావు తలమునకలయ్యాడని గ్రామస్థులు చెప్పుకునేవారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఇదే విషయాన్ని గురించి విశ్వేశ్వర్రావుని అడిగితే ‘అవును’ అని కాని, ‘కాదు’ అని కాని జవాబు చెప్పక చిన్నగా నవ్వేవాడు. విశ్వేశ్వర్రావు రీడింగ్ రూమ్‌లో చేతికందే ఎత్తులో గోడ మీద ఇండియా మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ పెద్ద పెద్ద అక్షరాలతో తెలుగు భాషలో ఉంటుంది. రోజూ ఆ మ్యాప్‌ను చూడడం ఆయన అలవాటు. ఈ అలవాటు ఆయనలో ఎంత నేర్పును తెచ్చిందంటే... కళ్లకు గంతలు కట్టుకొని ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం ఎక్కడ ఉందో స్టిక్‌తో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అప్పుడప్పుడు ఆయన కుటుంబసభ్యులు వచ్చేవారుగానీ సాయంత్రానికల్లా తిరిగి సిటీకి వెళ్లిపోయేవారు. విశ్వేశ్వర్రావు కోసం వచ్చే స్నేహితులు మాత్రం ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లేవారు. పాల కుర్రాడి ద్వారా విశ్వేశ్వర్రావు హత్యకు గురైన విషయం అందరికీ తెలిసింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశ్వేశ్వర్రావు మేధావి, అజాతశత్రువు. ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పోలీసులు రంగంలోకి దిగారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇన్స్పెక్టర్ నరసింహ దృష్టి గోడ మీద ఉన్న పటంపై పడింది. రెండు చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. ‘‘ఏమై ఉంటుంది?’’ అని ఆ మరకల గురించి సిబ్బందిని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ‘‘ఆ... ఏముంటుంది సార్... పైకి లేస్తూ ఆసరా కోసం గోడను పట్టుకుకోవడానికి ప్రయత్నించే క్రమంలో... మ్యాప్‌పై ఈ రక్తపు మరకలు పడి ఉంటాయి’’ అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ నరసింహకు మాత్రం అలా అనిపించలేదు. ఏదో ఉన్నట్లు అనిపించింది. ఏమై ఉంటుంది? విశ్వేశ్వర్రావు చాలా తెలివైనవాడు. మ్యాప్‌పై ఉన్న రక్తపు మరకల ద్వారా ‘క్లూ’ ఏదైనా ఇవ్వాలను కున్నాడా? ఆ ‘క్లూ’ ఏమిటో మ్యాప్‌ని ఎన్నిసార్లు చూసినా అర్థం కాలేదు. తాను అతిగా ఊహిస్తున్నానేమో అని కూడా అనిపించింది. విశ్వేశ్వర్రావు కుటుంబసభ్యులతో కొద్దిసేపు మాట్లాడాడు ఇన్స్పెక్టర్. ‘‘ఆయనకు చాలా సన్నిహితులైన స్నేహితులు ఐదుగురు ఉన్నారు. వారు తప్ప... ఆయన దగ్గరికి వెళ్లేంత సాహసం ఎవరూ చేయరు’’ అని చెప్పారు. ‘‘వారు ఎలాంటి వారో చెప్పగలరా?’’ అనే ప్రశ్నకు ‘‘వారి పేర్లు వినడం తప్ప... వారు ఎలాంటి వారో మాకు బొత్తిగా తెలియదు’’ అనే సమాధానం వినిపించింది. ‘‘సరే... వారి పేర్లయినా చెప్పండి’’ అని అడిగాడు ఇన్స్పెక్టర్. 1.రమణారావు 2.రాజా 3. రఘుపతి 4. నాగరాజు 5. కుటుంబరావు. ఈ పేర్లు వింటున్నప్పుడు... ఒకసారి తాను పదే పదే చూసిన మ్యాప్ గుర్తుకు వచ్చింది. ఈ అయిదు పేర్లలో రెండు పేర్లను టిక్ చేసి మ్యాప్ దగ్గరికి వెళ్లి చూశాడు. ‘‘రాజా, నాగరాజులను వెంటనే అరెస్ట్ చేయండి’’ అని ఆదేశించాడు. విశ్వేశ్వర్రావు హత్యకి కారణం తామేనని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఆ ఇద్దరు. మ్యాప్‌పై ఉన్న రెండు నెత్తుటి మరకలకు, ఆ పేర్లకు ఏమిటి సంబంధం? ఆ ఇద్దరిని ఇన్స్పెక్టర్ ఎందుకు అనుమానించాడు? -
రైతుల రుణాలను మాఫీ చేయాలి
నందిపేట : తెలంగాణ రాష్ట్రం లో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలను వెంటనే మాఫీ చేస్తూ జీఓను విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర రావు డిమాండ్ చేశారు. మంగళవారం మం డల కేంద్రంలో తెలంగాణ రా ష్ట్ర రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశానికి హాజరైన విశ్వేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత రిజర్వ్ బ్యాంకును సాకుగా చూపి తప్పించుకోవాలని చూ స్తోందని విమర్శించారు. గతేడాది ఆగస్టులో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సి డీ కింద నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని బోధన్ పట్టణ శివారులో గల శ్రీబాలాజీ రైస్‌మి ల్లు నుంచి దుమ్ము,ధూళీ వెలువడడం వల్ల చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు. తద్వా రా చిన్న, సన్నకారు రైతు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు పశ్య పద్మ, కంజర భూమయ్య, శేఖర్‌బాబు, శంకర్, షేక్ బాబు, సుధాకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు
టేకులపల్లి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆర్ఐఓ విశ్వేశ్వరరావు తెలిపారు. గురువారం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపియింగ్, మాల్ ప్రాక్టీస్ నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించన్నునట్లు తెలిపారు. జీపిఎస్ విధానం ద్వారా పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల మేరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకుండా నియంత్రిస్తామని అన్నారు. దీని ద్వారా హైటెక్ కాపియింగ్‌కు తెరపడుతుందని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు నియమించిన అధికారుల పని తీరు ను సైతం పరిశీలించేందుకు ప్రత్యేకంగా శాటిలైట్ సహాయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా తనిఖీ అధికారులు ఏ కేంద్రానికి వెళ్లారు, ఎంత సేపు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారనేది పూర్తి వివరాలు నమోదవుతాయని అన్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. జిల్లాలో 93 ప్రాక్టికల్స్, 104 థీయరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. జిల్లాలో 19 కాలేజీల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో సిలబస్ పూర్తయిం దని, ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో 15వ స్థానంలో ఉన్న ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.