వనస్థలిపురంలోని వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్వాకంపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. అలాగే విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి అవకాశం కల్పిస్తామని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఎంసెట్‌కు కూడా విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అనుమతి ఉన్న కళాశాల్లోనే తమ పిల్లలను చేర్చాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మంత్రి కడియం సూచించారు.