రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న యూనివర్సిటీల భౌగోళిక పరిధులను మార్చాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. విద్యార్థులు అవసరాల మేరకు దగ్గర్లో ఉన్న యూనివర్సిటీల పరిధిలోకి ఆయా జిల్లాలను తీసుకురావాలన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ వర్సిటీకి దగ్గరగా ఉన్న కాకతీయ వర్సిటీ పరిధిలో ఉందన్నారు. ఇలాంటివి మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన చర్యలపై వీసీలు దృష్టి సారించాలన్నారు. వీసీల నియామకం తర్వాత తొలిసారి వీసీలు, రిజిస్ట్రార్లతో కడియం సమావేశమయ్యారు.