క్షణం ఆలస్యం చేసినా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఇంటర్ విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. జంట జిల్లాల్లో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సోమవారం ప్రథమ సంవత్సరం, మంగళవారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వార్షిక పరీక్షలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్లలో తప్పులు ఇప్పటికే సరిదిద్దామని జంట నగరాల ఆర్‌ఐఓ రవికుమార్ తెలిపారు. అంతేగాక హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలకు ెహ చ్చరిక పంపామన్నారు.