వచ్చే నెల 3 నుంచి 24 వరకు జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి ఒకటి నుంచి 16 వరకు జరిగే థియరీ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు, సలహా, సూచనలు, సమస్యలపై గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : వచ్చే నెల 3 నుంచి 24 వరకు జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి ఒకటి నుంచి 16 వరకు జరిగే థియరీ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు, సలహా, సూచనలు, సమస్యలపై గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఆర్జేడీ, ఆర్‌ఐఓ, డీవీఈఓ, ప్రధానాచార్యులతో ఇంటర్ విద్య కమిషనర్ ఉదయలక్ష్మీ మాట్లాడుతారు. అనంతపురంలోని సీపీఓ కార్యాలయంలో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని 66 కేంద్రాల ప్రిన్సిపాళ్లు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని డీవీఈఓ చంద్రశేఖర్‌రావు, ఆర్‌ఐఓ వెంకటేశులు ఆదేశించారు.