
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న విమర్శలపై విద్యాశాఖ స్పందించింది. ఈ పరీక్షల్లో ఒక రోజు పనిచేసిన ఇన్విజిలేటర్ తిరిగి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ల నియామకాల్లో మార్పులు చేసింది. దీంతో కాపీయింగ్‌కు అవకాశం ఉండదని, పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యాల యంలో కమిషనర్ మాట్లాడుతూ...ఓపెన్ టెన్త్ పరీక్షలకు సంబంధించి 205 పరీక్షా కేంద్రాల్లో 57;249 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, పరీక్షల పర్యవేక్షణకు 39 స్క్వాడ్ బృం దాలు, 205 సిట్టింగ్ స్క్వాడ్ బృందా లు ఏర్పాటు చేశామన్నారు.
నాలుగు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో 247 మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని, 27 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి 146 పరీక్షా కేంద్రాల్లో 41;819 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, పరీక్షల పర్యవేక్షణకు 34 స్క్వాడ్ బృందాలు, 146 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామ న్నారు. డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఆధా రాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment