ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 229 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న టెన్త్ పరీక్షలకు 56,134 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొంది.
ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 176 పరీక్షా కేంద్రాల్లో 47,867 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపింది. జిల్లా, రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ వెల్లడించింది. అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఎన్‌ఆర్ (నామినల్ రోల్స్)లను ఇప్పటికే సంబంధిత పాఠశా లలకు పంపిం చామని పేర్కొంది.