Open Inter exams
-
ఓపెన్ ఇంటర్ పరీక్షలో ఎనిమిది మంది డిబార్
మంచిర్యాలసిటీ: మంచిర్యాల జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఓపెన్ ఇంటర్ పరీక్షలో ఎనిమిది మంది డిబార్ అయినట్లు డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో 1,146 మంది విద్యార్థులకు ఏర్పాట్లు చేయగా, 1,015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు పరీక్షకేంద్రాల్లో తొమ్మిది మందికి ఓపెన్ పది పరీక్ష ఏర్పాటు చేయగా అందరూ హాజరయ్యారు. -
అంతా..ఓపెన్
ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు అంతా ‘ఓపెన్’గానే జరుగుతున్నాయి. ఇంతకాలం మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా కొనసాగింది.. అది కొత్తపుంతలు తొక్కి ఏకంగా.. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే స్థాయికి చేరుకోవడం ఆ శాఖ అధికారులనిర్లక్ష్యాని కి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి, వరంగల్ రూరల్: ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇంటర్ 1,047, టెన్త్‌లో 669 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. టీఎస్‌డబ్ల్యూ గురుకులంలో 197 మంది, నర్సంపేట జిల్లా పరిషత్ బాలుర, బాలిక పాఠశాలలో 472 టెన్త్ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 488, నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో 582 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మూడు పువ్వులు..ఆరు కాయలు.. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల అక్రమ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అభ్యర్థుల ప్రవేశాల నుంచే పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ పరీక్ష ఫీజులు తీసుకునేప్పటి నుంచి పైసలు లాగడం ప్రారంభిస్తున్నారు. హాల్ టికెట్ ఇచ్చేప్పుడే సెంటర్ నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు వసులు చేశారని సమాచారం. ‘అంతా మావాళ్లే ఉంటారు.. డబ్బులు ఇస్తే మీరు బుక్కులు పెట్టి రాసుకున్నా ఎవరూ ఏమీ అనరు’.. అని చెబుతూ పరీక్ష రాసే అభ్యర్థులను బుట్టలో వేసుకుంటున్నారు. అభ్యర్థులకు దగ్గరే ఉండి చిట్టీలు అందించడంతోపాటు ఒకరికి బదులుఇంకోకరితో పరీక్ష రాయిస్తున్నారు. ఇన్విజిలేటర్లు సైతం ఒక్కో పరీక్ష రూ.300 నుంచి రూ.500 వరకు వసులు చేస్తున్నారని సమాచారం. వాట్సప్‌లలో పరీక్ష పత్రాలు పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే పరీక్ష పేపర్ వాట్సప్ ద్వారా బయటకు వస్తుంది. దీంతో ఆయా ఓపెన్ స్కూల్ సెంటర్ల నిర్వాహుకులు వాటికి సంబంధించిన జవాబులను తయారు చేసుకుని జీరాక్స్ పేపర్లను లోపలికి పంపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఒక గంటలో పరీక్ష పూర్తి చేసి బయటకు వస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాసేవారు, ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు వాడొద్దని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకున్నవారే లేరు. పట్టుబడుతున్న అభ్యర్థులు ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాస్తూ.. మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఈనెల 17న నర్సంపేటలో ఓపెన్ ఇంటర్ పరీక్షను ఒకరికి బదులు ఇంకొకరు రాస్తూ 23 మంది పట్టుబడ్డారు. మరో నలుగురు అభ్యర్థులు మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. వీరిని స్క్వార్ పట్టుకున్నారు. ఈ వ్యవహారం ఇన్విజిలేటర్లకు తెలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 18న పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలలో 14 మంది అభ్యర్థులు మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఈ అక్రమ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాస్ కాపీయింగ్నుప్రోత్సహిస్తే చర్యలు తప్పవు పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాలకు సిట్టింగ్ స్క్వాడ్లను సైతం ఏర్పాటు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. – నారాయణరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి -
‘ఓపెన్’ నిర్వహణపై కలెక్టర్ సీరియస్!
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మాస్ కాపియింగ్‌కు రంగం సిద్ధం చేయడంపై ‘అంతా ఓపెన్’ అనే పతాక శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఓపెన్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను మార్చాలని, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్లకు పరీక్షల విధులు ఎలా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం వెంటనే సిట్టింగ్ స్క్వాడ్స్‌తో అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయించారు. ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మమ అనిపించారు.. నిజామాబాద్‌లోని ఖిల్లా పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లు తెలిసింది. గేటు వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను అనుమతించని అధికారులు ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాశారంటే ఈ పరీక్షల నిర్వహణ తీరును అద్దం పడుతోంది. మొదటిరోజు తెలుగు పరీక్షకు తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులనే ఎగ్జామినేషన్ డ్యూటీ వేయడం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. సిట్టింగ్ స్క్వాడ్ సైతం పరీక్ష కేంద్రాలకు చివరి నిమిషంలో అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్విజిలేటర్ తొలగింపు..? నగరంలోని దుబ్బ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినట్లు తెలిసింది. కాగా మొదటిరోజు దుబ్బ పరీక్ష కేంద్రం వద్ద ఓ అభ్యర్థి గొడవకు దిగారు. గతంలో డబ్బులిచ్చినా పాస్ చేయించలేదని, ఈ సారైనా పాస్ చేస్తారా.. లేదా అని ఇన్విజిలేటర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ పంచాయితీ కాస్త కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆయన సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఆయనను ఇన్విజిలేటర్‌గా తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా డబ్బులు వసూలు చేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న సీఎస్‌లను కూడా మార్చాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్లకు ఎగ్జామినేషన్ విధులు కేటాయించడమే నిబంధనలకు విరుద్ధం. అందులోనా డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలను బేఖాతర్ చేసి విధులు కేటాయించి అవకతవకలకు తెరలేపడం విద్యాశాఖలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని రచ్చకీడ్చింది. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు జిల్లాలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో మొదటిరోజే మాల్ప్రాక్టిక్ కేసు నమోదైంది. ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ అభ్యర్థి నకల్ చీటిలతో పరీక్ష రాస్తుండగా సిట్టింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. కాగా మొదటిరోజు ఓపెన్ ఇంటర్ 3 పరీక్ష కేంద్రాల్లో 965 అభ్యర్థులకుగాను 876 మంది హాజరుకాగా 91 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఎస్సెస్సీ 8 కేంద్రాల్లో 1219 మందికిగాను 1127 అభ్యర్థులు హాజరు కాగా, 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెలవుపైవెళ్లిన డీఈఓ జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ సెలవుపై వెళ్లారు. మంగళవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు వ్యక్తిగత సెలవు పెట్టినట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ఇన్చార్జి డీఈఓగా అసిస్టెంట్ డైరెక్టర్ లాయక్అలీఖాన్ను నియమించారు. -
పాస్ గ్యారంటీ..!?
కొత్తగూడెం: తెలంగాణ సార్వత్రిక పీఠం ఆధ్వర్యంలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలలో ఎలాంటి అక్రమాలు జగరకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆయా సెంటర్ల నిర్వాహకులు మాత్రం విద్యార్థుల నుంచి పాస్ గ్యారంటీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రతీ ఏడాది ఇలాగే నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతులు లేకుండానే పరీక్షలకు.. రెగ్యులర్‌గా పది, ఇంటర్ మీడియట్ విద్యనభ్యసించలేనివారు సార్వత్రిక పీఠం ద్వారా చదువుకునేందుకు, రాష్ట్ర అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఈ ఏడాది 21 అధ్యయన కేంద్రాలు నడిచాయి. దీనికి గాను జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు తీసుకుంటారు. అభ్యర్థులకు ప్రతి ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు రోజుల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వం స్టడీ సెంటర్ నిర్వాహకులకు ఒక్కో తరగతి సబ్జెక్టుకు రోజుకు పదో తరగతి భోదించే వారికి రూ.40, ఇంటర్ తరగతులు భోదించే వారికి రూ.60 చొప్పున చెల్లిస్తుంది. 30 అడ్మిషన్లు దాటిన కేంద్రానికి అదనపు చెల్లింపులు ఉంటాయి. హాజరు పట్టిక ద్వారా విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేయాలి. తరగతుల బోధన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కానీ అనేక కేంద్రాల్లో తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు రాయిస్తున్నారని సమాచారం. ఇష్టారీతిన వసూళ్లు.. రెగ్యులర్‌గా చదవలేనివారితో పాటు ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం ఈ విద్యను అభ్యసించేవారు ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న నిర్వాహకులు వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష ఫీజు రూ.1200 కాగా, పాస్ గ్యారంటీ పేరుతో ఆయా అభ్యర్థుల వద్ద రూ. 3,000 నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అ«ధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్టడీ సెంటర్ నిర్వాహకుల మాటలు నమ్మి తరగతులకు హాజరు కాకుండానే పరీక్షలు రాసేవారు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. జిల్లాలో ఓపెన్ పరీక్షలలో 4 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని అధికారులు చెపుతుండడం దీనికి నిదర్శనం. అంతేకాక స్టడీ సెంటర్ నిర్వాహకులు సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయకపోవడం, తరగతులు నిర్వహించకపోవడంతో ఆసక్తి ఉన్నా పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉమ్మడి జిల్లా కేంద్ర అధికారులు పర్యవేక్షించాలి. కానీ వారు సక్రమంగా పట్టించుకోకపోవడంతో స్టడీ సెంటర్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేటి నుంచి పరీక్షలు... ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు మంగళవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెంలోని ఆరు కేంద్రాలలో పదో తరగతి పరీక్షలకు 1065 రెగ్యులర్, 679 మంది సప్లిమెంటరీ విద్యార్థులు, ఇంటర్ అభ్యర్థులు 5 కేంద్రాల్లో 805 మంది రెగ్యులర్, 473 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నారు. మంగళవారం నుంచి మే 1 వరకు, ఉదయం 8.30 నుంచి 11.30 గంటల మధ్య పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో రెవెన్యూ శాఖ వారిచే సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ, హై పవర్ కమిటీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్లను స్టడీ సెంటర్ నిర్వాహకులు జారీ చేయకపోతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోనే పరీక్షలు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని 11 సెంటర్లలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మకుండా మంచిగా చదివి పరీక్షలకు హాజరు కావాలి. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా, వారికి సిబ్బంది సహకరించినా సీసీఏ రూల్స్ 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు, 25/1997 చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – డి.వాసంతి, డీఈఓ -
17 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 229 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న టెన్త్ పరీక్షలకు 56,134 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొంది. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 176 పరీక్షా కేంద్రాల్లో 47,867 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపింది. జిల్లా, రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ వెల్లడించింది. అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఎన్ఆర్ (నామినల్ రోల్స్)లను ఇప్పటికే సంబంధిత పాఠశా లలకు పంపిం చామని పేర్కొంది.