Open Tenth
-
ఏపీలో ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్ స్కూల్ విద్యార్థులను పైరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్) -
ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు. 60 కేంద్రాల్లో 14,676 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 9,382 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో 53.12శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 14,077 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 7,478మంది పాసయ్యారు. పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలవగా వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక ఇంటర్ ఫలితాల్లో 71.96 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జవాబు పత్రాల పునఃపరీశీలన, డూప్లికేట్ సర్టిపికేట్లు పొందే సదుపాయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కమిటీ కల్పిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీటికి నిర్ణీత రుసుం ద్వారా ఏపీ అన్ లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 9.8.2019 నుంచి 20.08.19 వరకు ఫీజ్ చెల్లింపులకు చివరి తేదీగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.apopenschool.org లో చూడవచ్చు. -
ఓపెన్ టెన్త్ పరీక్షలకు రోజుకో ఇన్విజిలేటర్
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న విమర్శలపై విద్యాశాఖ స్పందించింది. ఈ పరీక్షల్లో ఒక రోజు పనిచేసిన ఇన్విజిలేటర్ తిరిగి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ల నియామకాల్లో మార్పులు చేసింది. దీంతో కాపీయింగ్‌కు అవకాశం ఉండదని, పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యాల యంలో కమిషనర్ మాట్లాడుతూ...ఓపెన్ టెన్త్ పరీక్షలకు సంబంధించి 205 పరీక్షా కేంద్రాల్లో 57;249 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, పరీక్షల పర్యవేక్షణకు 39 స్క్వాడ్ బృం దాలు, 205 సిట్టింగ్ స్క్వాడ్ బృందా లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో 247 మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని, 27 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి 146 పరీక్షా కేంద్రాల్లో 41;819 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, పరీక్షల పర్యవేక్షణకు 34 స్క్వాడ్ బృందాలు, 146 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామ న్నారు. డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఆధా రాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
17 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 229 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న టెన్త్ పరీక్షలకు 56,134 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొంది. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 176 పరీక్షా కేంద్రాల్లో 47,867 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపింది. జిల్లా, రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ వెల్లడించింది. అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఎన్ఆర్ (నామినల్ రోల్స్)లను ఇప్పటికే సంబంధిత పాఠశా లలకు పంపిం చామని పేర్కొంది. -
ఓపెన్ దందా..!
– ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో యథేచ్చగా కాపీయింగ్ – ఇన్విజిలేటర్లే విద్యార్థులకు స్లిప్పులు అందిస్తున్న వైనం ధర్మవరం : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం ) పరీక్షలు మూడు చూచిరాతలు.. ఆరు చీటీలుగా జరుగుతున్నాయి.. వీటిని నిరోధించాల్సిన ఇన్విజిలేటర్లు ఓపెన్ స్కూళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వారి దందా అడ్దూ అదుపులేకుండా జరుగుతోంది. జిల్లాలో ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక్క సెంటర్లో కూడా నిబంధనల మేరకు పరీక్షలు జరగడం లేదు. చాలా సెంటర్లలో ఇన్విజిలేటర్లే పరీక్షలు రాస్తూ, విద్యార్థులకు చీటీలు అందిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకపోతే వారే నేరుగా పరీక్షలు రాస్తుండటం విశేషం. పకడ్బందీగా జరగాల్సిన ఈ పరీక్షలను కేవలం చూసిరాతల పరీక్షలుగా జరుగుతున్నాయి. ఏకంగా ఓపెన్ స్కూళ్ల నిర్వహకులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులకు చీటీలను అందిస్తున్నారు. అలాగే ఇన్విజిలేటర్లను పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వాహకులు మహారాజుల్లా చూసుకుంటున్నారు. వారి దందాకు సహకరించని ఇన్విజిలేటర్లను సెల్ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో లొంగదీసుకుంటున్నారు. అడ్మిషన్ రోజే పాస్ గ్యారెంటీ హామీ జిల్లాలో ఓపెన్‌స్కూళ్ల దందా మితిమీరిపోతోంది. అడ్మిషన్‌కు రోజే వారితో పరీక్షలు చూసి రాసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పాస్ గ్యారెంటీ హామీతోనే అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. పరీక్ష మీరే రాస్తే.. ఒక లెక్క.. వేరొకరు రాస్తే ఒక లెక్క.. ఈ మేరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వహకులు అందుకు కావాల్సిన మొత్తాన్ని పరీక్ష ఫీజు కట్టించుకునే రోజే తీసుకుంటుండటం జగమెరిగిన సత్యం. రూ.5,000 నుంచి రూ.10,000 దాకా అదనపు ఫీజులు వసూలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇన్విజిలేటర్లు కనీసం మీడియాను కూడా అనుమతించకుండా పరీక్షలు రాయిస్తుండటం విశేషం. కాగా ఇలా పరీక్షలు నిర్వహించడం వల్ల రెగ్యులర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఇలాంటి అక్రమాలు నివారించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని నిర్వాహకులు ఈ పద్దతిని క్షేత్రస్థాయిలో అమలు జరగనియ్యడం లేదు. ఏకంగా ఆయా స్కూళ్ల నిర్వహకులు తలా ఓ సెంటర్‌ను పంచుకుని పిల్లలందరినీ ఒకే దగ్గర కూర్చోపెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. -
టు ఇన్ వన్
ఈ ఫొటోలో కన్పిస్తున్న వారు ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు.. ఏంటీ ఓకే తరగతి గదిలో టెన్త్, ఇంటర్ అని అలోచిస్తున్నారా..! మీ ఆలోచన నిజమే.. వీరు వేరువేరు తరగతులైనా ఒకే గదిలో కూర్చోబెట్టి అందరికీ ఒకే పాఠం చెబుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓపెన్‌స్కూల్ విధానం అమలు తీరుకు నిదర్శనం. మిర్యాలగూడ : బడికి వెళ్లకుండా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పేరుతో చేపట్టిన కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే నిర్వహించే ఈ తరగతులు అడపాదడపా జరుగుతున్నాయి. విద్యార్థులు వచ్చినా బోధించడానికి ఉపాధ్యాయులు రావడంలేదు. ఒక వేళ వచ్చినా టెన్త్, ఇంటర్ విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు బోధిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓపెన్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతికి 74 కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు 69 కేంద్రాలు ఉన్నాయి. కాగా పదో తరగతిలో 3200 మంది , ఇంటర్లో 2400 మంది అడ్మిషన్లు పొందారు. వీరికి 2016 సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొందిన వారికి సెలవు రోజుల్లో మాత్రమే విద్యాబోధన చేస్తారు. ఏడాదికి 30 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది. కాగా విద్యార్థులు కనీసం 24 రోజుల పాటు తరగతులకు హాజరుకావాల్సి ఉంది. ఇందులో పాఠాలు బోధించే రెగ్యులర్ ఉపాధ్యాయుడికి మాత్రం టెన్త్‌కు ఒక తరగతికి 60 రూపాయలు, ఇంటర్‌కు 120 రూపాయలు చెలిస్తున్నారు. కాగా విద్యార్థులు హాజరు కావడంలేదు. అదే సాకుతో ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడం లేదు. ఒక వేళ విద్యార్థులు వచ్చినా ఒకే తరగతి గదిలో బోధిస్తున్నారు. నేటికీ అందని పాఠ్యపుస్తకాలు ఓపెన్ స్కూల్లో చదివే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అడ్మిషన్ల సమయంలో పదో తరగతి విద్యార్థులు 800 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 1100 రూపాయలు చెల్లించారు. కానీ వీరికి ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది విద్యార్థులు గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద ఉన్న పాత పుస్తకాలు తీసుకుని చదువులు కొనసాగిస్తున్నారు. సమీపిస్తున్న పరీక్షలు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సాధారణ పరీక్షల సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మార్చి మాసంలోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందక పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయులు రావడం లేదు బకల్వాడ పాఠశాలలో ఓపెన్ టెన్త్ చదువుతున్నాను. నాలుగు వారాలుగా ఉపాధ్యాయులు బోధించడం లేదు. పాఠశాలకు వచ్చి ఖాళీగా వెళ్తున్నాము. ఉపాధ్యాయులు వస్తే ఇంటర్, టెన్త్ వారికి కలిపి ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. టెన్త్ ఇంటర్‌కు అవసరం లేకున్నా కూర్చోవాల్సి వస్తోంది. – చాంద్‌పాష, విద్యార్థి, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ పరీక్షలు సమీపించాయి పరీక్షలు మరో రెండు మాసాల్లో జరగనున్నాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను అడిగితే పుస్తకాలు రాలేదని చెబుతున్నారు. పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఏమి చదవాలో అర్థం కావడం లేదు. – మౌనిక, విద్యార్థిని, ఓపెన్ ఇంటర్, మిర్యాలగూడ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాము. అవి కూడా పూర్తిగా లేవు. పుస్తకాలు లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఉపాధ్యాయులను పాఠ్యపుస్తకాల గురించి అడిగినా రాలేదనే సమాధానం చెబుతున్నారు. – ఇందిరాప్రియదర్శిని, విద్యార్థిని, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ -
ఓపెన్ టెన్త్‌లో పట్టుబడిన నకిలీ విద్యార్థులు
పరిగి : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఇద్దరు నకిలీ విద్యార్థులు పట్టుబడ్డారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన శుక్రవా రం పరిగిలో చోటుచేసుకుంది. వివరాలు.. పరిగి నెం బర్ 0-1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఓపెన్ టెన్త్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించగా 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా పరీక్షా కేంద్రానికి ఛీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న గోపాల్ విద్యార్థుల హాల్‌టికెట్లను తనిఖీ చేశారు. అందులో ఇద్దరు విద్యార్థులకు బదులుగా మరో ఇద్దరు నకిలీ విద్యార్థులు రాస్తున్నట్లుగా గుర్తించారు. అరవ శ్రీశైలం, కృష్ణయ్య అనే ఇద్దరు విద్యార్థులు గండేడ్ మండల పరిధిలోని మహ్మదాబాద్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అప్పియర్ అయ్యారు. కాగా వారికి బదులుగా గండేడ్ మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన ఎ.సత్యం(ఇంటర్ విద్యార్థి) శ్రీశైలంకు బదులుగా, ఐటీఐ విద్యార్థి పి.నర్సింలు కృష్ణయ్యకు బదులుగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. నకిలీ విద్యార్థులను పట్టుకున్న గోపాల్‌ను డీఈఓ రమేష్ అభినందించారు. -
‘ఓపెన్’ పరీక్షార్థుల లబోదిబో
సత్తుపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా పత్రికల్లో వరుస కథనాలు రావటంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పరీక్ష పాస్ చేయించేందుకు దళారులకు డబ్బులు ఇచ్చిన విద్యార్థులు.. ఇప్పుడు తమ పరిస్థితేమిటంటూ లబోదిబోమంటున్నారు. పాస్ గ్యారెంటీ పేరుతో వేయి నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేసిన దళారులకు ఏం చెప్పాలో తెలీడం లేదు. అదిగో.. ఇదిగో పరీక్షల నిర్వహణలో సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ కళ్లుగప్పి, పరీక్షార్థులకు కాపీలు అందించేందుకు ఏజెంట్లు కొత్త దారులు వెతుకుతున్నట్టు తెలిసింది. సత్తుపల్లిలోని మూడు సెంటర్లతోపాటు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాల, ఖమ్మం ప్రభుత్వ పాఠశాల, కారేపల్లి, భద్రాచలం, పాల్వంచ కేంద్రాలలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా వచ్చిన కథనాలతో వీటిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫలానా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందంటూ స్క్వాడ్ అధికారులకు అపరిచితుల మాదిరిగా ఏజెంట్లే సెల్ మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. ఇది నిజమేననుకుని స్క్వాడ్ అటువైపు వెళ్లగానే.. ఈ ఏజెంట్లు ఇటువైపు మరో కేంద్రంలో తమ వారికి కాపీలు అందిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. డబ్బులు ఇచ్చేయండి ‘మిమ్మల్ని నమ్మి వేల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మమ్మల్ని కనీసంగా కూడా పట్టించుకోవటం లేదు. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి’ అని, దళారులను పరీక్షార్థులు ఒత్తిడి చేస్తున్నారు. చివరి నిమిషంలోనైనా చిట్టీలు అందించి ‘న్యాయం’ చేస్తామంటూ వారిని బుజ్జగించేందుకు నిర్వాహకులు (దళారులు) ప్రయత్నిస్తున్నారు. -
ఒకరికి బదులు మరొకరు
- ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఇద్దరు డిబార్ విద్యారణ్యపురి/పరకాల : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అక్కడక్కడ మాస్ కాపీయింగ్ సాగుతూనే ఉంది. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ పట్టుపడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మేకల గోవర్ధన్‌కు బదులుగా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన జాలిగపు అనిల్ రాస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్ శేషాచార్యులు హాల్‌టికెట్ పరిశీలించి తేడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావు తెలిపారు. అసలు విద్యార్థి మేకల గోవర్ధన్‌ను డిబార్ చేసినట్లు చెప్పారు. హన్మకొండలోని ప్రభుత్వ హైస్కూల్లో ఒకరు కాపీరుుంగ్ చేస్తుండగా డిబార్ అయ్యూరు. కొడకండ్లలో ఐదుగురు డిబార్ కొడకండ్ల : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఐదుగురు విద్యార్థులను మంగళవారం డిబార్ చేసినట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వామిచరణ్ తెలిపారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన స్పెషల్ స్క్వాడ్ రాగా మాస్ కాపీరుుంగ్కు పాల్పడుతుండటంతో వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.