పరిగి : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఇద్దరు నకిలీ విద్యార్థులు పట్టుబడ్డారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన శుక్రవా రం పరిగిలో చోటుచేసుకుంది. వివరాలు.. పరిగి నెం బర్ 0-1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఓపెన్ టెన్త్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించగా 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా పరీక్షా కేంద్రానికి ఛీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న గోపాల్ విద్యార్థుల హాల్‌టికెట్లను తనిఖీ చేశారు.
అందులో ఇద్దరు విద్యార్థులకు బదులుగా మరో ఇద్దరు నకిలీ విద్యార్థులు రాస్తున్నట్లుగా గుర్తించారు. అరవ శ్రీశైలం, కృష్ణయ్య అనే ఇద్దరు విద్యార్థులు గండేడ్ మండల పరిధిలోని మహ్మదాబాద్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అప్పియర్ అయ్యారు. కాగా వారికి బదులుగా గండేడ్ మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన ఎ.సత్యం(ఇంటర్ విద్యార్థి) శ్రీశైలంకు బదులుగా, ఐటీఐ విద్యార్థి పి.నర్సింలు కృష్ణయ్యకు బదులుగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. నకిలీ విద్యార్థులను పట్టుకున్న గోపాల్‌ను డీఈఓ రమేష్ అభినందించారు.
ఓపెన్ టెన్త్‌లో పట్టుబడిన నకిలీ విద్యార్థులు
Published Sat, May 9 2015 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 3:47 PM
Advertisement