- ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఇద్దరు డిబార్
విద్యారణ్యపురి/పరకాల : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అక్కడక్కడ మాస్ కాపీయింగ్ సాగుతూనే ఉంది. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ పట్టుపడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మేకల గోవర్ధన్‌కు బదులుగా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన జాలిగపు అనిల్ రాస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్ శేషాచార్యులు హాల్‌టికెట్ పరిశీలించి తేడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్‌రావు తెలిపారు. అసలు విద్యార్థి మేకల గోవర్ధన్‌ను డిబార్ చేసినట్లు చెప్పారు. హన్మకొండలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఒకరు కాపీరుుంగ్ చేస్తుండగా డిబార్ అయ్యూరు.
కొడకండ్లలో ఐదుగురు డిబార్
కొడకండ్ల : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఐదుగురు విద్యార్థులను మంగళవారం డిబార్ చేసినట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వామిచరణ్ తెలిపారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన స్పెషల్ స్క్వాడ్ రాగా మాస్ కాపీరుుంగ్‌కు పాల్పడుతుండటంతో వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
ఒకరికి బదులు మరొకరు
Published Wed, May 6 2015 5:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement