కార్యచరణ ప్రణాళికను మా ముందుంచండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా
హైదరాబాద్: అన్ని పబ్లిక్ పరీక్షల్లో ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి కోర్టు ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్ కాపీయింగ్‌ని అడ్డుకోవడంలో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారని, కాపీయింగ్‌ని అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాల ని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే ఓసారి విచారిం చిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అన్ని జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చామని తెలిపారు. అంతేకాక 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ సమయంలో పిటిషనర్ త రఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి స్పం దిస్తూ, ఈ వ్యాజ్యంలో విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేయాలని, అప్పటికి ప రీక్షలు పూర్తయి ఉంటాయని, వచ్చే ఏడాదికి ట్యాబ్‌లు ఉపయోగించే అంశంపై అప్పుడు విచారణ చేపట్టవచ్చునని తెలిపారు. తరువాత తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో సోమవారానికల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏపీ ప్రతిపాదించిన వాటిని తాము కూడా అమలు చేస్తామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మాస్ కాపీయింగ్ నిరోధానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, దానిని తదుపరి వి చార ణ నాటికి కోర్టు ముందుంచాలని ఉ భ య రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మాస్ కాపీయింగ్ నిరోధానికి ప్రణాళిక సిద్ధం చేయండి
Published Thu, Mar 17 2016 11:46 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement