హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ సీఐ భీమ్‌రెడ్డి వివరాల ప్రకారం.. కాకతీయ వర్సిటీ నిర్వాహకులు సురేష్, రాజిరెడ్డితో కలిపి మరో నలుగురు డిగ్రీ దూరవిద్య పరీక్షలను నిజాం కళాశాల సెంటర్‌లో రాయాల్సి ఉండగా కింగ్ కోఠీలోని పద్మశాలి భవన్లో పరీక్షలు రాస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మాస్‌కాపీయింగ్ పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు భీమ్‌రెడ్డి తెలిపారు.