సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 19న జరగాల్సిన ఇంటర్మీడియెట్ పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9న జరగాల్సిన పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. అయితే ఇప్పుడు రద్దయిన మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు 19వ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొంది. అయితే తాము మాత్రం ఆ రోజు (19వ తేదీన) పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.