అంతా డొల్లే..
Published Wed, Mar 2 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
విజయవాడ: ‘సర్వం సిద్ధం.. ఏర్పాట్లన్ని పూర్తి చేశాం’.. అని బీరాలు పలికిన అధికారుల డొల్లతనం మొదటి పరిక్షతోనే తేట తెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. ఏర్పాట్లన్ని పూర్తి చేశామని గొప్పలు చెప్పిన అధికారులు పలు చోట్ల విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించగా.. మరి కొన్ని చోట్ల ఒకే బెంచ్ పై నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టారు. కొన్ని చోట్ల సరైన వెలుతురు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. విజయవాడ ఎస్‌ఏఎస్ కళాశాలలో విద్యార్థులను ఆరు బయటే పరీక్షలు రాయించడంతో.. తీవ్రమైన ఎండలోనే విద్యార్థులు పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ అంశంపై కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించడానికి ప్రయత్నించిన విలేకరితో అధికారులు దురుసుగా ప్రవర్తించారు.
Advertisement
Advertisement