‘మినిట్’ టెన్షన్
Published Wed, Mar 2 2016 11:53 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
ఆధోని: తెలుగు రాష్ట్రాలలో బుధవారం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి హజరు కానివ్వమని అధికారులు ముందే హెచ్చరించడంతో.. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆర్టీసీ బస్సులను నమ్ముకొని వచ్చే విద్యార్థుల కన్నా తల్లిదండ్రుల సాయంతో పరీక్ష కేంద్రాలకు హజరయ్యే వారే ఎక్కువగా కనిపించారు. ‘డెడ్‌లైన్’ దగ్గర పడుతున్నా కొంతమంది విద్యార్థుల ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి.
కర్నూలు జిల్లా ఆధోనిలోని బాలాజి జూనియర్ కళాశాల వద్ద పరీక్ష కేంద్రంలోనికి ‘ప్యాడ్’లు అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం పరీక్ష కేంద్రంలో టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలపడంతో వారు శాంతించారు.
Advertisement
Advertisement