ఇంటర్‌ పరీక్షలపై కెమెరా కన్ను | Inter Exams Surveillance With CC Cameras | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలపై కెమెరా కన్ను

Published Tue, Feb 26 2019 11:15 AM | Last Updated on Tue, Feb 26 2019 11:15 AM

Inter Exams Surveillance With CC Cameras - Sakshi

శ్రీకాకుళం: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూ ర్తయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్‌ పరీక్షలపై సీసీ కెమెరాలతో నిఘా పె ట్టనున్నారు. గతంలో సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే ఈ కెమెరాలను వినియోగించేవారు. ఈ ఏడాది అన్ని కేంద్రాల్లోనూ వినియోగించాలని ఆదేశాలు జారీ కావడంతో ఇప్పటికే దాదాపు పరీక్ష కేంద్రాలన్నింటిలో కెమెరాల అమరిక పూర్తి చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 27 నుంచి ప్రథమ సంవత్సర, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇప్పటికే ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి.

థియరీ పరీక్షలకు జిల్లా నుంచి 59,614 మంది హాజరు కానున్నారు. వీరిలో మొదటి ఏడాది జనరల్‌ విద్యార్థులు 27,357 మంది కాగా, 1694 మంది వొకేషనల్‌ విద్యార్థులు, రెండో ఏడాది జనరల్‌ విద్యార్థులు 25,625 మంది కాగా, వొకేషనల్‌ విద్యార్థులు 1501 మంది పరీక్ష రాయనున్నారు. ప్రైవేటు అభ్యర్థులు జనరల్‌ నుంచి 3347 మంది, వొకేషనల్‌విభాగం నుంచి 90 మంది పరీక్షకు హాజరు కానున్నారు. వీరందరికీ రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు. 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 39 ప్రభుత్వ, ఒక మోడల్‌ స్కూల్, 6 సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలు, మూడు ట్రైబల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలలు, ఒక కో ఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాల, 55 ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది నుంచి విద్యార్థులకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు పరీక్షల్లో అక్రమాలకు తెరలేపుతున్నాయని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఈ నిర్ణ యం తీసుకున్నారు. పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు శనివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశా రు. ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఫర్నీచర్‌ సమస్య తీవ్రంగా ఉండగా, సమీప కళాశాలల నుంచి ఫర్నీచర్‌ను సమకూర్చుకోవాలని సంబంధిత పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఆదేశాలు అందాయి. పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ, రవాణా శాఖ అధికారులతో పరీక్షలు జరిగిన కాలంలో సంబంధిత శాఖలు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పరీక్ష తేదీలు ఇలా
ప్రథమ సంవత్సరం 27న సెకండ్‌ లాంగ్వేజ్, మార్చి 1న ఇంగ్లీషు, 5న గణితం–1ఎ, బోటనీ, సివిక్స్, 7న గణితం–1బి, జువాలజీ, హిస్టరీ, 9న ఫిజిక్స్, ఎకనామిక్స్, 12న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్, 14న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌ బ్రిడ్జి కోర్సు, 16న మోడర్న్‌ లాంగ్వేజ్, జాగ్రఫి

ద్వితీయ సంవత్సరం
28న సెకండ్‌ లాంగ్వేజ్, 2న ఇంగ్లీషు, 6న గణితం –2ఎ, బోటనీ, సివిక్స్, 8న గణితం–2బి, జువాలజీ, హిస్టరీ, 11న ఫిజిక్స్, ఎకనామిక్స్, 13న కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్, 15న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌ బ్రిడ్జి కోర్సు, 18న మోడర్న్‌ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు జరగనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement