శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఫస్టియర్ తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా తదితర (సెకెండ్ లాగ్వేజ్) పేపర్లతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల మెటీరియల్‌ను ఇప్పటికే ఆయా కేంద్రాలకు చేరవేశారు. 96 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు జనరల్, ప్రైవేట్, ఒకేషనల్, బ్యాక్‌లాగ్ విభాగాలు కలిపి 59,385 మంది హాజరుకానున్నారు. ఇందులో బాలురు 30,401, బాలికలు 28,984 మంది ఉన్నారు.
తనిఖీలకు సిద్ధం..
గతంలో మాస్‌కాపీయింగ్ జరిగినట్లున్న ఆరోపణలున్న కేంద్రాలపై నిఘా ఉంచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. డీఈసీ కమిటీ, ఒక హైపవర్ కమిటీతోపాటు 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇన్విజిలేటర్లు కొరత ఉన్న కళాశాలల్లో సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులను నియమించారు. తాగునీటితోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ.. దూర ప్రాంతాల రూట్లలో ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు.
144 సెక్షన్ అమలు...
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతోపాటు, 144 సెక్షన్ అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చే/పట్టారు. డీఆర్‌ఓ ఆయా కేంద్రాల పరిధిలోని మండల తాహసీల్దార్లకు, సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఆశాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్ష జరిగే సమయంలో జెరాక్స్, ప్రింటెడ్ షాపులు తెరవకూడదని జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షలు తప్పవా
అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 20 వరకు సర్కారు కళాశాలలతోపాటు 15 వరకు ప్రైవేటు కళాశాలల్లో నేలరాతలు కూడా తప్పడంలేదని తెలుస్తోంది. కొన్ని కళాశాలల్లో కేవలం కుర్చీలతో సరిపెట్టేంచేందుకు అద్దెకు బుక్ చేసుకున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కొన్నిచోట్ల విద్యుత్, వెలుతురు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
విద్యార్థులకు సూచనలు:
పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ కేంద్రాలకు అర్ధగంట ముందే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ లేకుండా అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్లు, స్కెచ్చులు, గ్లిట్టర్స్, స్కేల్, వాటర్‌బాటిల్ వగైరా వంటివి వెంట తెచ్చుకోవాలి.
హాల్‌టికెట్లలో ఆధార్ నెంబర్‌ను ముద్రించారు. దానిని నిర్ధారించుకోవాలి.
హాల్‌టికెట్లలో ముద్రించిన విద్యార్ధులు, తల్లిదండ్రుల పేర్లు, మీడియం, హాజరవుతున్న పరీక్ష పేపర్లు వంటి అంశాలు సరిచూసుకోవాలి. తప్పులున్నట్లయితే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి.
పరీక్ష కేంద్రంలోనికి పేపర్లు, మెటీరియల్స్, సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, పేజర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పొరపాటున జేబులో ఉండి పట్టుబడినా డిబార్‌తోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు
- పరీక్ష హాల్‌కు వెళ్లిన వెంటనే సీటుకు ముందు, వెనుక ఇరువైపులా ఎటువంటి పేపర్లు, అనవసర చిత్తుకాగితాలున్నట్లు గమనిస్తే వాటిని కిటికీ ఆవల విసిరేయాలి. లేదా ఇన్విజిలేటర్‌కు విషయాన్ని చెప్పాలి.
ఓఎంఆర్ షీట్‌లో బార్‌కోడ్‌లో ఉన్న పేరు, సబ్జెక్టు తనదేనని విద్యార్ధి నిర్ధారించుకోవాలి.
ఓఎంఆర్‌షీట్‌లోని బార్‌కోడ్‌పై ఎటువంటి రాతలు, పెన్నుగీత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
సెకండియర్‌లోని అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, వాణిజ్యశాస్త్రం ప్రశ్నపత్రాలలో పాత, కొత్త సిలబస్‌ల పేపర్లుంటాయి. రెగ్యులర్ విద్యార్ధులు కొత్త సిలబస్‌ను, గతంలో ఫెయిలై మళ్లీ రాస్తున్న విద్యార్ధులు పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రాన్ని రాయాల్సి ఉంటుంది.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Tue, Mar 1 2016 11:59 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement