సాక్షి, విజయవాడ : కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 23) రోజున జరగాల్సిన ఇంటర్మీడియట్ చివరి పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ ప్రకటన చేసింది. త్వరలోనే వాయిదాపడిన పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనాను ఎదుర్కొవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎం జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment