హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం అయాయి. జూన్ 1 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.
అరగంట ముందే పరీక్ష హాల్లోకి రావాలని, నిర్ణీత సమయం తరువాత అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,14,505 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1,73,331 మంది హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7 వరకు జరుగుతాయి. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 8న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 9న ఉంటాయి. వొకేషనల్ విద్యార్థులకూ ఇవే వర్తిస్తాయి.
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం
Published Mon, May 25 2015 9:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement