హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 25 నుంచి వచ్చే నెల 1 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డా.అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు.
అరగంట ముందే పరీక్ష హాల్లోకి రావాలని, నిర్ణీత సమయం తరువాత అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,14,505 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1,73,331 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7 వరకు జరుగుతాయి. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 8న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 9న ఉంటాయి. వొకేషనల్ విద్యార్థులకూ ఇవే వర్తిస్తాయి.