మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ | inter exams starts from march 2nd | Sakshi
Sakshi News home page

మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

Published Tue, Nov 24 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

 షెడ్యూల్ జారీ చేసిన ఇంటర్మీడియెట్ బోర్డు
 ♦ 21వ తేదీ వరకు నిర్వహణ
ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్స్
జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష
అదేనెల 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
పరీక్షలకు హాజరుకానున్న దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు
ఏపీలోనూ మార్చి 2 నుంచే పరీక్షలు ప్రారంభించే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్  బోర్డు షెడ్యూలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూలుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఆమోదం తెలిపారు. ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 3న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అంతకంటే పది రోజుల ముందుగానే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో బోర్డు కసరత్తు చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలు రాయబోయే విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది.

ఇదే విషయాన్ని పేర్కొంటూ ఈ నెల 16న 'మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు' శీర్షికన సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం మార్చి 2 నుంచి 16వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు పూర్తి కానుండగా, 21వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ద్వితీయ భాష పేపర్‌తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి 2 నుంచే ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 11 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. అయితే తెలంగాణ సర్కారు ఏ రోజు నుంచి పరీక్షలను ప్రారంభిస్తుందో అదే రోజు నుంచి ఏపీలోనూ ప్రారంభించాలని భావిస్తోంది. గతేడాది పరీక్షల సందర్భంగా తెలంగాణలో ముందుగా పరీక్షలు జరుగడంతో ఇక్కడి ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఏపీలోనూ రావడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. దీంతో తెలంగాణతోపాటే ఏపీలోనూ పరీక్షల నిర్వహణకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

 ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్
 ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఆదివారాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయి. టైంటేబుల్ కూడా ఒకేలా ఉంటుంది. అయినప్పటికీ వొకేషనల్ విద్యార్థుల కోసం మళ్లీ వేరుగా టైంటేబుల్ జారీ చేయనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

 పరీక్షల షెడ్యూలు ఇదీ..
 ప్రథమ సంవత్సర టైంటేబుల్
 తేదీ                          వారం                పరీక్ష                
 2-3-2016          బుధవారం            ద్వితీయ భాష పేపర్-1
 4-3-2106         శుక్రవారం            ఇంగ్లిషు పేపర్-1
 8-3-2016        మంగళవారం        మ్యాథ్స్ పేపర్-1ఏ, బాటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1, సైకాలజీ పేపర్-1
 10-3-2016      గురువారం            మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
 12-3-2016      శనివారం            ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1
 15-3-2016      మంగళవారం        కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
 17-3-2016      గురువారం        జియాలజీ పేపర్-1, హోంసెన్సైస్ పేపర్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి 
                                                     కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)    
 19-3-2016      శనివారం             మాడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

 ద్వితీయ సంవత్సర టైంటేబుల్
 తేదీ                  వారం                పరీక్ష
 3-3-2016     గురువారం            ద్వితీయ భాష పేపర్-2
 5-3-2016      శనివారం            ఇంగ్లిషు పేపర్-2
 9-3-2016     బుధవారం            మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2, సైకాలజీ పేపర్-2
 11-3-2016    శుక్రవారం            మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
 14-3-2016    సోమవారం            ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2
 16-3-2016    బుధవారం            కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2
 18-3-2016    శుక్రవారం            జియాలజీ పేపర్-2, హోంసెన్సైస్ పేపర్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి
                                                    కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
 21-3-2016    సోమవారం            మాడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జియాగ్రఫీ పేపర్-2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement