మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు  | Intermediate exams from March 4 | Sakshi
Sakshi News home page

మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు 

Published Tue, Dec 3 2019 4:11 AM | Last Updated on Tue, Dec 3 2019 5:43 AM

Intermediate exams from March 4 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో సంవత్సర పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 23 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డ్‌ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

నైతిక విలువలు (ఎథిక్స్‌), మానవ విలువలు (హ్యూమన్‌ వ్యాల్యూస్‌) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు. ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి. ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement