
సాక్షి, అమరావతి : ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మొదటి సంవత్సరం, ఫిబ్రవరి 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహించనుంది. జనవరి 28న హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, 30న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్, ఫిబ్రవరి ఒకటి నుండి 20వ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.