అక్కకు సాయం చేస్తూ దొరికిపోయిన చెల్లెలు | sister's held for cheating inter exams | Sakshi
Sakshi News home page

అక్కకు సాయం చేస్తూ దొరికిపోయిన చెల్లెలు

Published Sat, Mar 15 2014 10:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

అక్కకు సాయం చేస్తూ దొరికిపోయిన చెల్లెలు - Sakshi

అక్కకు సాయం చేస్తూ దొరికిపోయిన చెల్లెలు

హైదరాబాద్ : అక్కను పాస్ చేయించాలనుకొని ఓ చెల్లెలు పరీక్ష రాస్తూ పట్టుబడింది. దీంతో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డబీర్పూరా నూర్ఖాన్ బజార్కు చెందిన ఓ చెల్లి డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటుంది. చంచల్గూకు చెందిన అక్క (29) ఇంటర్ పలుమార్లు తప్పడంతో ఈమారు ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో తన దూరపు బంధువు, వరసకు చెల్లెలను ఆశ్రయించింది.

తన బదులు పరీక్ష రాయాలని కోరడంతో ఆమె కూడా ఒప్పుకొని శుక్రవారం జాంబాగ్ వివేకవర్థిని కాలేజీలో పరీక్ష రాస్తుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా... ఆమె సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేసి నిందితులిద్దర్నీ రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement