ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' కొద్దిరోజు క్రితం తన కంపెనీకి చెందిన డెలివరీ బాయ్స్ కోసం గ్రీన్ టీ షర్టును ప్రవేశపెట్టింది. సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ రెడ్ టీ షర్ట్ ధరించి తమ కస్టమర్లకు ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే వెజ్ డెలివరీ సమయంలో మాత్రం గ్రీన్ టీ షర్ట్స్ ధరించాలని సదరు కంపెనీ ఆదేశించింది.
జొమాటో తీసుకున్న నిర్ణయంపై సోషల్‌మీడియాలో పెద్ద దుమారమే రేగింది. నాన్ వెజ్ తినే వారిని ఇలా అవమానిస్తున్నారా..? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో ఆ నిర్ణయాన్ని జొమాటో వెనక్కి తీసుకుంది. ఇదే విషయంపై హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. నాకొక సందేహం.. దీనికి సమాధానం మీలో ఎవరికైనా తెలిస్తే వివరణ ఇవ్వండి. గ్రీన్ టీ షర్ట్ ధరించి వెజ్ తినే వారికి ఫుడ్ డెలివరీ చేస్తే తప్పేంటి..? అలా చేయడం వల్ల నాన్ వెజ్ తినే వారి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి..? అసలు ఈ విషయంలో నాకు ఏమీ అర్థం కావడం లేదు.' అని కామెంట్ చేసింది.
అయితే, రష్మీ చేసిన వ్యాఖ్యలకు ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. 'సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఇలాంటి ట్రిక్స్ మామూలే.. రీచ్ కోసం రష్మి పడుతున్న కష్టాలు అంటూ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే రష్మీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. 'సోషల్ మీడియాలో రీచ్ కోసమైతే జొమాటో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు.. దానిని జూమ్ చేసీ చేసీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికింది అనుకుంటున్నాను.' అని కౌంటర్ ఇచ్చింది. యాంకర్‌గా మెప్పించిన రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా మెప్పించింది. సమాజంలోని అసమానతలు, మూగజీవాల రక్షణ కోసం రష్మి పాటు పడుతూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
Reach kosam I don’t have to talk about these issues
— rashmi gautam (@rashmigautam27) March 23, 2024
One pic chalu zoom in chesi chesi 🤤 karchuthu avasram leni attention istaru
I hope you got your attention now
I wonder how long your wait was https://t.co/e7UluLFsKp
Comments
Please login to add a commentAdd a comment