
Multi-restaurant Cart Feature : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో వినియోగదారులు యాప్‌లలో జరిపే కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి.
సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఏదైనా ఒక రెస్టారెంట్ అందించే ఆహర పదార్ధాల్ని ఆర్డర్ పెట్టుకునే సౌకర్యం ఉంది. అయితే ఇకపై, జొమాటో యాప్‌లో అలాకాదు మీకు నచ్చిన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌ను వివిధ రెస్టారెంట్ల నుంచి బుక్ చేసుకోవచ్చు. కొత్త మల్టీ రెస్టారెంట్ కార్ట్ పేరుతో యాప్‌లో కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. ఫీచర్‌తో వినియోగదారులు ఒకేసారి 4 ఫుడ్ ఐటమ్స్‌ను వివిధ రెస్టారెంట్ల నుంచి బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీంతో సదరు జొమాటో ఎగ్జిక్యూటీవ్ ఒకేసారి నాలుగు ఫుడ్ ఐటమ్స్‌ను డెలివరీ చేస్తారు.
కార్ట్‌లో ఆర్డర్ మెనూ డిలీట్ అవ్వదు
ఒక్కసారి జొమాటో కార్ట్‌లోకి ఎంటరై ఒక్కసారి ఫుడ్ ఆర్డర్ పెడితే..ఆ కార్ట్‌లోని రెస్టారెంట్‌లు, ఫుడ్ ఐటమ్స్ వివరాలు డిలీట్ కావు. మరోసారి ఎంట్రీ చేసే పనిలేకుండా జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ సందర్భంగా జొమాటో కొత్త ఫీచర్‌పై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ. ‘జొమాటోలో మెరుగైన కస్టమర్ అనుభవం కోసం నిరంతరం మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా కావాల్సిన మెనూలో కావాల్సిన ఐటమ్స్‌ను బుక్ చేసుకోవచ్చు.
జొమాటో ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఫోన్ పే, ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) యాప్‌లలో అందుబాటులో ఉంది. వీటితో పాటు క్లౌడ్ కిచెన్ యూనికార్న్ రెబల్ ఫుడ్స్ యూజర్లు ఒకేసారి పలు రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని యాడ్ చేసుకోవచ్చు.
జొమాటో గోల్డ్ లాయల్టీ ప్రోగ్రాం ప్రారంభం
అదనంగా, ఈ ఏడాది జనవరిలో జొమాటో తన జొమాటో గోల్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను తిరిగి ప్రారంభించింది. గోల్డ్ మెంబర్‌షిప్ మూడు నెలల పాటు రూ.149కే లభిస్తుంది. వినియోగదారుడి ఆర్డర్ ధర రూ.199 దాటితో 10 కిలోమీటర్ల పరిధిలో రెస్టారెంట్ ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ పొందవచ్చు.
చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!
Comments
Please login to add a commentAdd a comment