కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్‌గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్ కారు అది.
ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.
ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు
ఆస్టన్ మార్టిన్ బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్ ఇంజిన్‌తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment