‘లెజెండ్స్‌’ సర్వీసు నిలిపేసిన జొమాటో | Zomato decided to shut its intercity food delivery service Legends | Sakshi
Sakshi News home page

Zomato: ‘లెజెండ్స్‌’ సర్వీసు నిలిపేత

Published Fri, Aug 23 2024 7:47 AM | Last Updated on Fri, Aug 23 2024 8:36 AM

Zomato decided to shut its intercity food delivery service Legends

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో తన ‘ఇంటర్‌సిటీ ఫుడ్‌ డెలివరీ సర్వీసు-లెజెండ్స్‌’ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2022లో ప్రారంభించిన ఈ సేవలవల్ల కంపెనీకి లాభాలు రాకపోవడంతో దాన్ని ఉపసంహరించుకుంటున్నామని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

‘జొమాటో 2022లో ప్రారంభించిన ఇంటర్‌సిటీ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను తక్షణమే నిలిపేస్తున్నాం. దాదాపు రెండేళ్లుగా ఈ విభాగాన్ని లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించాం. కానీ ఈ సర్వీసులపై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గోయల్‌ తెలిపారు.

ఇదీ చదవండి: కేంద్ర ప్రోత్సాహకాలు కొనసాగింపు

ఇంటర్‌సిటీ ఫుడ్‌ సర్వీసులో భాగంగా అప్పటికే నిల్వ చేసిన ఆహార పదార్థాలకు బదులుగా నేరుగా రెస్టారెంట్‌ల నుంచి డెలివరీ చేయడం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈ ఫుడ్‌ను అందించాలని నిర్ణయించారు. అయితే ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే కనీసం రూ.5,000తో ఫుడ్‌ను ఆర్డర్ చేయాలి. ఈ సేవలను కొన్ని కారణాల వల్ల ఏప్రిల్‌లో నిలిపివేశారు. తర్వాత జులైలో పునఃప్రారంభించారు. కంపెనీ లాభాలు పెరగడానికి నష్టాల్లోని బిజినెస్‌ను నిలిపేశారు. ఇదిలాఉండగా, జొమాటో ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజును భారీగా పెంచింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.253 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. అంతకు ముందు ఏడాది రూ.2 కోట్లతో పోలిస్తే, నిర్వహణ ఆదాయం 74% పెరిగి రూ.4,206 కోట్లకు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement