క్యూ2లో రూ. 176 కోట్లు
8,500 కోట్ల సమీకరణకు సై
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ.176 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ.36 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,848 కోట్ల నుంచి రూ. 4,799 కోట్లకు జంప్‌చేసింది.
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్) ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు జొమాటో తెలిపింది. కాగా, 4 వారాల్లో డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ ద్వారా డైనింగ్, మూవీస్, స్పోర్ట్స్ టికెటింగ్, షాపింగ్ తదితర గోయింగ్ అవుట్ సర్వీసులను కన్సాలిడేట్ చేయనున్నట్లు వివరించారు.
ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం నష్టంతో రూ. 257 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment