
'ముంబైలో ఆత్మహుతి దాడులు చేస్తా'
ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద ఆత్మాహుతి దాడులు చేస్తానంటూ సిరియా నుంచి తిరిగొచ్చిన అరీబ్ మజీద్ అనే యువకుడు ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఆ యువకుడు ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. మజీద్ స్నేహితుడు ఫహీద్ షేక్ కూడా అతడితో కలిసి గత సంవత్సరం సిరియా వెళ్లిపోయాడు. అతడు కూడా ఐఎస్ఐఎస్లో చేరేందుకే వెళ్లినట్లు సమాచారం.
ఫహీద్ షేకే ఈ ట్విట్టర్ ఖాతాను నిర్వహించేవాడని అంటున్నారు. మజీద్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాడో తెలుసుకోండి.. అంటూ ట్వీట్లు మొదలయ్యాయి. అరీబ్ మజీద్ సోదరిని భారతీయ పోలీసులు తీవ్రంగా అవమానించారని, అందుకే వాళ్లమీద ప్రతీకారం తీర్చుకోడానికి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసేందుకు అతడు వస్తున్నాడని చెప్పారు. ఐఎస్ఐఎస్లో మజీద్ సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని కూడా ఆ ట్వీట్లో అన్నారు.