అక్కడ కూడా సత్తా చూపిస్తారా? | Dhanush Starts Shooting For Balaji Mohan's Next Opposite Kajal Agarwal | Sakshi
Sakshi News home page

అక్కడ కూడా సత్తా చూపిస్తారా?

Published Tue, Nov 11 2014 1:10 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అక్కడ కూడా సత్తా చూపిస్తారా? - Sakshi

అక్కడ కూడా సత్తా చూపిస్తారా?

గ్లామర్ తార కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో మెరవనున్నారు. అదీ తమిళనాట ప్రస్తుతం మంచి క్రేజున్న హీరో ధనుష్ సరసన! గతంలో తెలుగు, తమిళ భాషల్లో ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాన్ని అందించిన బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలోని కథానాయక పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా నిర్ణయించారు. సినిమా పేరు -‘మారి’. ‘‘మంచి పాత్ర కావడంతో కాజల్ అగర్వాల్‌ను ఈ చిత్ర కథానాయికగా ఎంచుకున్నాం’’ అని దర్శకుడు ప్రకటించారు.

పూర్తి స్థాయి సకుటుంబ వినోదంగా తయారయ్యే ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ అతికినట్లు సరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ప్రస్తుతానికి ఆమె పాత్ర తీరుతెన్నుల గురించి యూనిట్ పెదవి విప్పడం లేదు. దర్శకుడు బాలాజీ మోహన్ తన గత చిత్రాల లాగే ఇందులోనూ పూర్తి స్థాయిలో వినోదం పంచనున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యే ‘గోవిం దుడు అందరివాడేలే’ లాంటి సకుటుంబ వినోద చిత్రంలో మెరిసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తమిళ కుటుంబ కథలో తన సత్తా చూపనున్నారన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement