Hero Dhanush
-
ఊహించని కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్న సర్ మూవీ
-
ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్
Dhanush Aishwarya Divorce Fans Shocking Reactions: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్‌లోనే కాకుండా వివిధ చిత్ర పరిశ్రమలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా ధనుష్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు ధనుష్. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాంజన సినిమాతో హిందీలో తెరంగ్రేటం చేశాడు. తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా, ధనుష్ చిత్రాలు కొన్ని వివిధ భాషల్లో విడుదలయ్యాయి. ఇలా ధనుష్ వివిధ వర్గాల ప్రేక్షకులను అలరించాడు. ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. ధనుష్ హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాడిన 'కొలవెరి ఢీ' సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు ధనుష్. టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రేక్షకజనానికి ధనుష్ ప్రకటన షాక్‌కు గురి చేసింది. ధనుష్ అభిమానులు బాధ అయితే వర్ణనాతీతం. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తమ బాధను వెల్లబోసుకుంటున్నారు ధనుష్ అభిమానులు. ఇదీ చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా? That's unexpected and shocking! The reasons behind the break-up are none of our business. Media and fans should give them the space they need. We just wish #Dhanush and @ash_r_dhanush sis all the best for the future! Be strong Thalaivaa @rajinikanth ❤️😢 pic.twitter.com/v4cRtclPXn — 𝗩 𝗠 𝗧 ツ | 𝗔 𝗞 (@VMT_0fficial) January 17, 2022 This icons picture becomes meaningless now😢...#dhanush whyyyyy???????? @rajinikanth love you thalaivaaa pic.twitter.com/wc6jpsTIBM — elsa (@elsa_Amna) January 17, 2022 🥺😢 Please Be Strong Thalaiva @rajinikanth❤ #Dhanush #AishwaryaDhanush pic.twitter.com/iovD0lD5Lp — Rajan (@Subash1899) January 17, 2022 Kind request to all not to make fun of #Dhanush & #AishwaryaD separation You don't know how it affects when we are in a situation to leave our loved one 💔 It's heartbreaking one but still we respect you both @dhanushkraja & @ash_r_dhanush ❤️ Stay strong @rajinikanth sir 🥺 pic.twitter.com/FanxThypae — RaGuVaRaN (@MemesSingle) January 17, 2022 Shocking 🥺🥺 💔💔 Dhanush & Aiswarya divorce #Dhanush #aishwarya #Rajinikanth #divorce #tamilcinema pic.twitter.com/3Tb8dp082B — Salam Mass (@SALAMMASS1) January 17, 2022 This one is not even an year old ra 💔#Dhanush pic.twitter.com/9k3I2zc4Q7 — Troll Cinema ( TC ) (@Troll_Cinema) January 17, 2022 Despite of the Issue inside his family, this Man greeted his fans(Pongal) at his door step with Smile on his face to give the due respect to his fans gathered ❤️🙏 Anta Manasu Tan Sir Kadavul😍 Stay Strong Thalaivaa!🙏#Rajinikanth #Thalaivar @rajinikanth#Dhanush pic.twitter.com/QQk1ihmtJ8 — ONLINE RAJINI FANS🤘 (@OnlineRajiniFC) January 17, 2022 -
ధనుష్‌ను వరించిన బ్రిక్స్ అవార్డు.. ఎందుకో తెలుసా ?
Hero Dhanush Got Best Actor Award In BRICS Film Festival: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు మరో గౌరవం దక్కింది. నవంబర్ 28న జరిగిన బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్లో 'అసురన్' చిత్రానికి గాను ధనుష్‌ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఈ ఆనందకర విషయాన్ని ధనుష్ ట్విటర్లో పంచుకున్నాడు. ఈ అవార్డు గురించి చెబుతూ 'ఒక పరిపూర్ణ గౌరవం' అని ట్వీట్ చేశాడు. అలాగే ఈ సినిమాకు 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. An absolute honour 🙏🙏🙏 pic.twitter.com/DBPo5mTJGV — Dhanush (@dhanushkraja) November 28, 2021 ఈ అసురన్ సినిమా పూమణి రచించిన వెక్కయ్ నవల ఆధారంగా తీసిన పీరియాడికల్ చిత్రం. ఇందులో ధనుష్, మంజూ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'అసురన్' సినిమాను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నారప్ప పేరుతో రీమెక్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ చివరిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జగమే తంధిరమ్ సినిమాలో నటించాడు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం మారన్, తిరుచిత్రంబళం షూటింగ్లో బిజీగా ఉన్నాడు ధనుష్. -
మొదట చిరు.. ఆ తర్వాత నాగ్..!
సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ఒక సెన్సేషన్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఒక భారీ చిత్రంలో టాలీవుడ్ బిగ్‌స్టార్ అక్కినేని నాగార్జునను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదే ఆ సూపర్ న్యూస్. పవర్ పాండి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తి, తనేమిటో ప్రూవ్ చేసుకున్న నటుడు ధనుష్. ప్రస్తుతం ఆయన హీరోగా ఎన్నై నోకి పాయుమ్ తూట్టా, వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్నారు. మరో పక్క తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ఒక మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ మరోసారి మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. దీన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. ధనుష్ దర్శకత్వం వహించి హీరోగా నటించనున్న ఇందులో మరో హీరో పాత్రను టాలీవుడ్ ప్రముఖ నటుడితో నటింపజేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఆ పాత్రను ప్రఖ్యాత హీరో చిరంజీవి చేస్తే బాగుంటుందని భావించిన ధనుష్ ఆయన్ని సంప్రదించగా తాను సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీంతో ధనుష్ అక్కినేని నాగార్జునను నటింపజేసే పనిలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాగార్జున చాలా కాలం క్రితమే మణిరత్నం ఇదయల్తై తిరుడాదే చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రక్షకన్, ఇటీవల తోళా(తెలుగులో ఊపిరి) చిత్రాలతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ధనుష్ ఆఫర్‌ను అక్కినేని ఆహ్వానిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ధనుష్‌కు ఆ లుక్కే లేదు!
నటుడు ధనుష్‌కు హీరో లుక్కే లేదని ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా పేర్కొన్నారు. జేవీడీఎం క్రియేషన్స్ పతాకంపై బాలసుధన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం తుణీకరం. వినోద్ లోహిదాసన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో దర్శకుడు బాలసుధన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇది చిన్న చిత్రం అయినా శాన్గోకుల్ సంగీతాన్ని, తనూజ్మీనన్ నేపథ్య సంగీతాన్ని అందించడం విశేషం. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు కస్తూరీరాజా మాట్లాడుతూ తుణీకరం అనే టైటిల్ పెట్టడంలోనే ఈ చిత్ర యూనిట్ ధైర్యం తెలుస్తోందన్నారు. దర్శకుడిగా అవకాశం రావడం అంత సులభం కాదన్నారు. తాను రెండు సార్లు అమాయకుడనే ముద్రకు గురయ్యానన్నారు. తన తొలి చిత్రానికి నిర్మాత వేటలో పడ్డప్పుడు ఒక సారీ, ధనుష్‌తో చిత్రం చేసినప్పుడు రెండోసారి అలాంటి ముద్రకు గురయ్యానని అన్నారు. తుళ్లువదో ఇళమై చిత్ర సమయంలో ధనుష్‌కు హీరో లుక్కే లేదన్నారు. ఆ చిత్ర నిర్మాణానికి ఫైనాన్స్ అడిగినప్పుడు ఒక ఫైనాన్సియర్ తండ్రీ కొడుకులు కలిసి కెమెరా పట్టుకుని ఆటలాడుకుంటున్నారా? అని విమర్శలు చేశారన్నారు. అలాంటి అవమానాలు, విమర్శలు ఎదుర్కొని నిలబడ్డానన్నారు. రాజ్‌కిరణ్ లాంటి దైవం కారణంగానే తానీ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, ఆర్కే.విద్యానాథన్, నటుడు బోస్‌వెంకట్, జాగ్వర్‌తంగం అతిథులుగా పాల్గొన్నారు. తుణీకరం క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. -
వై దిస్ కొలవరికి పదికోట్లు
చెన్నై: కొలవరి సాంగ్ మీకు గుర్తుండే ఉంటుందిగా ఒక్క దక్షిణాదినే కాకుండా మొత్తం భారత్ దేశాన్ని ఊపుఊపిన పాట అది. వై దిస్ కొలవెరీ అంటూ ధనుష్ గాత్ర పరిచిన ఈ గీతం ఎన్నిరకాల రికార్డులు సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి నోట వెంట ఉన్నా ఆ సాంగే వినిపించేది. ఇప్పటికీ చాలా పార్టీల్లో ఆపాట సందడి చేస్తుంటుంది కూడా. కొన్ని తెలుగు, కొన్ని ఇంగ్లిష్, మరికొన్ని తమిళ, ఇతర భాషలకు చెందిన పదాలను కలిపి రాసిన ఈ పాట జనాల నోళ్లలో ఓ రేంజిలో నానింది. ఆ పాట ఇప్పుడు తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సాంగ్‌ను చూసినవారి, విన్నవారి జాబితా పదికోట్లకు చేరి మరో రికార్డును రాసుకుంది. -
ఒక పాత్ర... మూడు కోణాలు
విభిన్న పాత్రలు పోషిస్తూ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో ధనుష్. ఆయన పాత్రకు మూడు కోణాలను చూపిస్తూ కె .వి ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘అనేకుడు’. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ నాయికలు. ఈ చిత్రం గురించి కె.వి.ఆనంద్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రంలో హీరో ధనుష్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందించాం. హారిస్ జయరాజ్ మంచి పాటలందించారు.’’అని తెలిపారు. -
అక్కడ కూడా సత్తా చూపిస్తారా?
గ్లామర్ తార కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో మెరవనున్నారు. అదీ తమిళనాట ప్రస్తుతం మంచి క్రేజున్న హీరో ధనుష్ సరసన! గతంలో తెలుగు, తమిళ భాషల్లో ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాన్ని అందించిన బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలోని కథానాయక పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా నిర్ణయించారు. సినిమా పేరు -‘మారి’. ‘‘మంచి పాత్ర కావడంతో కాజల్ అగర్వాల్‌ను ఈ చిత్ర కథానాయికగా ఎంచుకున్నాం’’ అని దర్శకుడు ప్రకటించారు. పూర్తి స్థాయి సకుటుంబ వినోదంగా తయారయ్యే ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ అతికినట్లు సరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ప్రస్తుతానికి ఆమె పాత్ర తీరుతెన్నుల గురించి యూనిట్ పెదవి విప్పడం లేదు. దర్శకుడు బాలాజీ మోహన్ తన గత చిత్రాల లాగే ఇందులోనూ పూర్తి స్థాయిలో వినోదం పంచనున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యే ‘గోవిం దుడు అందరివాడేలే’ లాంటి సకుటుంబ వినోద చిత్రంలో మెరిసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తమిళ కుటుంబ కథలో తన సత్తా చూపనున్నారన్న మాట!