ధనుష్‌కు ఆ లుక్కే లేదు!
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు కస్తూరీరాజా మాట్లాడుతూ తుణీకరం అనే టైటిల్ పెట్టడంలోనే ఈ చిత్ర యూనిట్ ధైర్యం తెలుస్తోందన్నారు. దర్శకుడిగా అవకాశం రావడం అంత సులభం కాదన్నారు. తాను రెండు సార్లు అమాయకుడనే ముద్రకు గురయ్యానన్నారు. తన తొలి చిత్రానికి నిర్మాత వేటలో పడ్డప్పుడు ఒక సారీ, ధనుష్‌తో చిత్రం చేసినప్పుడు రెండోసారి అలాంటి ముద్రకు గురయ్యానని అన్నారు. తుళ్లువదో ఇళమై చిత్ర సమయంలో ధనుష్‌కు హీరో లుక్కే లేదన్నారు.
ఆ చిత్ర నిర్మాణానికి ఫైనాన్స్ అడిగినప్పుడు ఒక ఫైనాన్సియర్ తండ్రీ కొడుకులు కలిసి కెమెరా పట్టుకుని ఆటలాడుకుంటున్నారా? అని విమర్శలు చేశారన్నారు. అలాంటి అవమానాలు, విమర్శలు ఎదుర్కొని నిలబడ్డానన్నారు. రాజ్‌కిరణ్ లాంటి దైవం కారణంగానే తానీ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, ఆర్‌కే.విద్యానాథన్, నటుడు బోస్‌వెంకట్, జాగ్వర్‌తంగం అతిథులుగా పాల్గొన్నారు. తుణీకరం క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని దర్శకుడు వెల్లడించారు.