మొదట చిరు.. ఆ తర్వాత నాగ్‌..! | nagarjuna will acts in hero dhanush direction movie | Sakshi
Sakshi News home page

ధనుష్‌ ఆఫర్‌కు నాగ్‌ ఓకేనా?

Published Tue, Feb 6 2018 8:53 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

nagarjuna will acts in hero dhanush direction movie - Sakshi

సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ఒక సెన్సేషన్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఒక భారీ చిత్రంలో టాలీవుడ్‌ బిగ్‌స్టార్‌ అక్కినేని నాగార్జునను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదే ఆ సూపర్‌ న్యూస్‌. పవర్‌ పాండి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తి, తనేమిటో ప్రూవ్‌ చేసుకున్న నటుడు ధనుష్‌. ప్రస్తుతం ఆయన హీరోగా ఎన్నై నోకి పాయుమ్‌ తూట్టా, వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్నారు. మరో పక్క తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై ఒక మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ధనుష్‌ మరోసారి మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అవుతున్నారు. దీన్ని శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. ధనుష్‌ దర్శకత్వం వహించి హీరోగా నటించనున్న ఇందులో మరో హీరో పాత్రను టాలీవుడ్‌ ప్రముఖ నటుడితో నటింపజేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఆ పాత్రను ప్రఖ్యాత హీరో చిరంజీవి చేస్తే బాగుంటుందని భావించిన ధనుష్‌ ఆయన్ని సంప్రదించగా తాను సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నానని  చెప్పినట్లు ప్రచారంలో ఉంది. 

దీంతో ధనుష్‌ అక్కినేని నాగార్జునను నటింపజేసే పనిలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నాగార్జున చాలా కాలం క్రితమే మణిరత్నం ఇదయల్తై తిరుడాదే చిత్రం ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రక్షకన్, ఇటీవల తోళా(తెలుగులో ఊపిరి) చిత్రాలతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ధనుష్‌ ఆఫర్‌ను అక్కినేని ఆహ్వానిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement