![Foreign Sarakku Movie Ready For Release - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/7/6996.jpg.webp?itok=Q-B2T_JC)
ఫారిన్ సరకు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నెప్టియన్ సెయ్‌లర్స్ పతాకంపై గోపినాథ్ నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్వరన్ కుప్పసామి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దానితో చిత్రంలో పాటు ప్రధాన పాత్ర పోషిస్తూ, సహ నిర్మాతగా బాధ్యతలను నిర్వహించారు. దీనిలో సుందర్ అనే వ్యక్తి కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. షిప్‌లో పని చేసిన ఈ ముగ్గురూ సినిమాపై ఆసక్తితో ముందుగా షార్ట్ ఫిలింస్ చేశారు.
తాజాగా ఫారిన్ సరకు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ రంగప్రవేశం చేశారు. ఫారిన్ సరకు అనగానే ఏదేదో ఊహించుకునే అవకాశం ఉందని, చిత్రం చూసిన తరువాత ప్రేక్షకుల భావన మారుతుందని దర్శకుడు మంగళవారం చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన చిత్రం ఇదన్నారు. తమలాంటి వారికి అవకాశం కలిగించాలన్న భావనతో 300 మందిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేసినట్లు తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్టాల మధ్యలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఇది రెగ్యులర్ ఫార్ములాలో సాగే చిత్రం కాదని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. చిత్రాన్ని విడుదల చేయడమే విజయంగా భావిస్తున్నట్లు నిర్మాత గోపినాథ్ తెలిపారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే..
ప్రముఖ దర్శక-నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి
Comments
Please login to add a commentAdd a comment