ఎలా చెప్పను | Ela Cheppanu movie to be released on august 15 | Sakshi
Sakshi News home page

ఎలా చెప్పను

Published Mon, Aug 12 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

ఎలా చెప్పను

ఎలా చెప్పను

 పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందిన తమిళ చిత్రం ‘కోళి కూవుదు’ తెలుగులో ‘ఎలా చెప్పను’ పేరుతో విడుదల కానుంది. లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తాండ్ర కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 15న సినిమాని విడుదల చేస్తున్న సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాను. రామ్‌రాజు స్వరపరచిన పాటలు సినిమాకి ఎస్సెట్‌గా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. ఏపీలో మొత్తం 100 థియేటర్లలో విడుదల చేయనున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. అశోక్, శిజారోజ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.ఐ. రంజిత్ దర్శకత్వం వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement