30 ఏళ్ల త‌ర్వాత‌ సూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌.. నెక్స్ట్ హైద‌రాబాద్‌లోనే | Sequel To The Super Hit Movie Gentleman After 30 Years, First Schedule Completed In Hyderabad - Sakshi
Sakshi News home page

30 ఏళ్ల త‌ర్వాత‌ సూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌.. హైద‌రాబాద్‌లోనే షూటింగ్‌..

Published Thu, Nov 2 2023 5:52 PM | Last Updated on Thu, Nov 2 2023 6:15 PM

Gentleman 2 Second Schedule Update - Sakshi

దర్శకుడు గోకుల్‌ కృష్ణ, నిర్మాత‌ కె.టి.కుంజుమోన్‌

శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.టి.కుంజుమోన్‌ 1993లో నిర్మించిన జెంటిల్‌మన్‌ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 30 ఏళ్ల తరువాత కె.టి.కుంజుమోన్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు, కథానాయకుడు, సంగీత దర్శకుడు అందరూ మారిపోయారు. ఈ చిత్రానికి గోకుల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్‌, నయనతార చక్రవర్తి జంటగా నటిస్తున్న ఇందులో 50 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

అజయ్‌ విన్సెంట్‌ చాయాగ్రహణం, వైరముత్తు పాటలను, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌యింద‌ని చిత్ర‌యూనిట్ వెల్ల‌డించింది. తొలి షెడ్యూల్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ షూటింగ్‌లో పలు కీలక సన్నివేశాలను, భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలిపారు.

కాగా రెండో షెడ్యూల్‌ను నవంబర్‌ మూడో వారంలో మొదలుపెట్టి చైన్నె, హైదరాబాద్‌, పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ముంబై, మలేషియా, శ్రీలంకలలో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పారు.

చ‌ద‌వండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియ‌ర్ బాల‌య్య ఇక లేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement