నాలోని ప్రపంచాన్ని రాశా! | Shruti Haasan Shares Throwback Video Playing The Piano | Sakshi
Sakshi News home page

నాలోని ప్రపంచాన్ని రాశా!

Published Tue, Mar 30 2021 3:45 AM | Last Updated on Tue, Mar 30 2021 3:56 AM

Shruti Haasan Shares Throwback Video Playing The Piano - Sakshi

ఓ తమిళ చిత్రానికి కథ రాస్తున్నట్లు ఇటీవల శ్రుతీహాసన్‌ చెప్పారు. ఇప్పుడు ఓ మ్యూజిక్‌ వీడియోను విడుదల చేసే పని మీద ఉన్నారు. నిజానికి ఈ పాటను బ్రిటన్‌లో ఓ వేదిక మీద ప్రేక్షకులకు వినిపించారు. ఈ పాట రాసింది ఆమే. ‘‘అక్కడి శ్రోతలు పాటను బాగా ఎంజాయ్‌ చేశారు. ఈ పాటనే కొంచెం కొత్త రకంగా మలచి విడుదల చేయనున్నాను’’ అన్నారు శ్రుతీహాసన్‌. ఒకవైపు ఈ పనులు చేయడంతో పాటు నటిగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయినప్పటికీ కవితల పుస్తకాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘నా పదో ఏట నుంచే కవితలు రాస్తున్నాను. ఈ మధ్య నా ఫ్రెండ్స్‌ కొందరు ఆ కవితలన్నింటినీ బుక్‌ రూపంలో తీసుకురావొచ్చు కదా అన్నారు. ఆ ఐడియా నచ్చింది. ఒక నటిగా నేను బయటి ప్రపంచంలోనే ఎక్కువ టైమ్‌ గడుపుతుంటాను. కానీ నా లోపలి ప్రపంచం ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రపంచం గురించే కవితలు రాశాను’’ అన్నారు శ్రుతీహాసన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement