Red Giant Gets Simbu Vendhu Thanindhathu Kaadu | Gautham Menon - Sakshi
Sakshi News home page

Hero Simbu: రెడ్‌ జెయింట్‌ ఖాతాలో శింబు కొత్త మూవీ

Published Sun, Jul 10 2022 2:01 PM | Last Updated on Sun, Jul 10 2022 2:49 PM

Red Giant Gets Simbu Vendhu Thanindhathu Kaadu - Sakshi

మానాడు హిట్‌ తరువాత శింబు నటిస్తున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వేల్స్‌ ఫిలిం పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గుజరాతీ భామ సిద్ధి ఇడ్‌నాని కథానాయికగా పరిచయం అవుతోంది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇందులో శింబు విభిన్న పాత్రల్లో నటించినట్లు, ఆయన గెటప్‌ కూడా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్‌ 15న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్‌ ఫొటోలపై ఫ్యాన్స్‌ అసంతృప్తి!
దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement