
చిత్రం విడుదలై 75 రోజులు దాటినా ఇప్పటికీ బయ్యర్లు తనకు వసూళ్ల వివరాలను అందించడం లేదని నిర్మాత సురేష్ కామాక్షి వాపోయారు.
విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మానాడు చిత్రానికే ఇలాంటి గతియా? అంటూ ఆ చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి వాపోయారు. ఈయన తన వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మానాడు. కోవిడ్ సమయంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే చిత్రం విడుదలై 75 రోజులు దాటినా ఇప్పటికీ బయ్యర్లు తనకు వసూళ్ల వివరాలను అందించడం లేదని నిర్మాత సురేష్ కామాక్షి వాపోయారు.
ఈయన దీని గురించి ట్విట్టర్‌లో పేర్కొంటూ సక్సెస్‌ఫుల్ చిత్రానికే ఇలాంటి గతి ఐతే ఇక ఈ వృత్తిని ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో నటులు, నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టి సారించడంలో తప్పు ఏముందని నిలదీస్తున్నారు.
#maanaadu75days pic.twitter.com/m6A1Z4XMLF
— sureshkamatchi (@sureshkamatchi) February 5, 2022