అప్పుడు కాత్తు వాక్కుల రెండు కాదల్‌.. ఇప్పుడు.. | Mass Ravi Bhupathi Starrer Kaathuvaakula Oru Kadhal Poster Out | Sakshi
Sakshi News home page

Kaathuvaakula Oru Kadhal: కాత్తు వాకుల ఒరు కాదల్‌.. ఇరువురి భామల మధ్య..

Published Wed, Jan 3 2024 4:48 PM | Last Updated on Wed, Jan 3 2024 4:48 PM

Mass Ravi Bhupathi Starrer Kaathuvaakula Oru Kadhal Poster Out - Sakshi

నయనతార, సమంత, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాత్తు వాక్కుల ఒరు కాదల్‌ అనే పేరుతో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం రూపొందడం విశేషం. చైన్నె ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎళిల్‌ అనియన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాస్‌ రవి భూపతి కథ, కథనం, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి లక్ష్మీప్రియ, మంజుల కథానాయికలుగా నటిస్తున్న ఇందులో సూపర్‌ సుబ్బరాయన్‌, సాయి దినా, సత్య, కల్లూరి వినోద్‌, ఆదిత్య ఖదీర్‌, తంగదురై, ఫవర్‌ స్టార్‌, కబాలి విశ్వంత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ గాలిని ఎవరూ చూడలేరని, అనుభూతిని మాత్రమే పొందగలరని అన్నారు. అదే విధంగా ప్రేమలో నలుపు, ఎరుపు ఎవరూ చూడలేదని దాన్ని కేవలం ఫీల్‌ అవగలరన్నారు. అలా ఒక నిజమైన ప్రేమ చుట్టూ తిరిగే కథా చిత్రమే కాత్తు వాక్కుల ఒరు కాదల్‌ అని పేర్కొన్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు ఎలా మోసపోతున్నారనేదాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు.

నేటి తరం ప్రేక్షకులకు కావలసిన ప్రేమ, వినోదం, యాక్షన్‌, థ్రిల్లర్‌, ఎమోషనల్‌.. అన్ని రకాల కమర్షియల్‌ అంశాలతో చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ చైన్నె, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జీకే వీ సంగీతాన్ని, రాజదురై ఎంఏ, సుభాష్‌ ఎన్‌.మణియన్‌ ద్వయం ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు.

చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement