ఆన్‌లైన్ చక్రవడ్డీ రుణాల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ర్యాట్ అని దర్శకుడు జోయల్ విజయ్ తెలిపారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆబ్రో సినిమాస్ పతాకంపై పి. రాజరాజన్ సమర్పణలో ముత్తులక్ష్మి రాజరాజన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ విజ్ఞాన ప్రపంచం నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి చాలా మంచి జరుగుతున్నా, కొంత చెడు కూడా జరుగుతోందన్నారు.
డిజిటల్ టెక్నాలజీని కొందరు అవినీతికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అలా ఆన్‌లైన్ చక్ర వడ్డీ రుణాలతో మోసపోయిన ముగ్గురు మహిళల ఇతివృత్తమే ర్యాట్ చిత్రమని తెలిపారు. ఇందులో నటి రేష్మ వెంకటేష్, ఛాయాదేవి ప్రధాన పాత్రల్లో పోషిస్తుండగా నటి కనికరవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారన్నారు. దీనికి శ్రీనివాస్ దేవాన్స్ ఛాయాగ్రహణం, అశ్విన్ హేమనాథ్ సంగీతం అందిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు
హీరోతో డేటింగ్, రిషికేష్‌లో ప్రియుడితో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న బిగ్‌బీ మనవరాలు
Comments
Please login to add a commentAdd a comment